సబంగ్ స్థానంలో టీఎంసీ గెలుపు: యూపీ, అరుణాచల్లో 3చోట్ల బీజేపీ గెలుపు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని సబంగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి గీతారాణి భూనియా గెలుపొందారు. గీతారాణి ఉప ఎన్నికల్లో 64వేలకు పైగా ఓట్లు సాధించారు.

సీపీఎం అభ్యర్థికి 41వేలకు పైగా, బీజేపీ అభ్యర్థికి 37వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 18వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మనస్ భూనియా 2016 ఎన్నికల్లో టీఎంసీ తరఫున నిలబడి లెఫ్ట్ ఫ్రంట్ సాయంతో గెలుపొందారు.

Assembly bypoll results: BJP wins Pakke-Kasang, 28-Likabali, Sikandra; TMC bags Sabang

మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్‌లోని పక్కే కేసాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఇదే రాష్ట్రంలోని లికాబాలి నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి కార్డో నైగ్యోర్ గెలుపొందారు. యూపీలోని సికంద్ర నియోజకవర్గంపై బీజేపీ జెండా ఎగిరింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While Chennai's Dr. Radhakrishnan Nagar (RK Nagar) by-poll grabs major attention today, counting in Assembly by-poll in Uttar Pradesh's Sikandra, Arunachal Pradesh's Pakke-Kessang is still underway with TMC already registering a win West Bengal's Sabang.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి