Puducherry Assembly Election Results 2021: పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ
పుదుచ్చేరి అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కూటమితో, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి హోరాహోరీ తలపడుతోంది. ఉదయం కౌంటంగ్ మొదలైనప్పటి నుంచి ఇరు కూటముల మధ్య ఆధిక్యాలు దోబూచులాడుతున్నాయి. అయితే బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.
Recommended Video
పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ రెండు కూటమిలో ఏ ఒక్క దానికీ ఇప్పటివరకూ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఎన్డీయే కూటమి 7 స్ధానాల్లో, కాంగ్రెస్-డీఎంకే కూటమి 6 స్ధానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు ఫలితాల సరళి బట్టి తెలుస్తోంది. పుదుచ్చేరిలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ ఆశలకు చెక్ పెట్టేందుకు బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ ఇక్కడ తీవ్రంగా శ్రమించాయి.

ఈసారి పుదుచ్చేరిలో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ.. ఎన్నార్ కాంగ్రెస్ సాయంతో అధికారం కోసం తీవ్రంగా శ్రమించింది. కాంగ్రెస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలను, మంత్రులను తమ కూటమిలోకి తెచ్చుకుంది. దీని ప్రభావం ఎన్నికల్లో పడేలా కనిపిస్తోంది. అయితే పొరుగున ఉన్న తమిళనాడులో ప్రభావం చూపడంలో విఫలమమవుతున్న బీజేపీ.. పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం దక్షిణాదిలో ఆ పార్టీకి ఇదో ఘనవిజయంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications