9 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు

గుహవాటి: అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 మంది రెబల్ అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. ఇక ముందు పార్టీని ధిక్కరించిన వారికి ఇదే పరిస్థితి ఎదురౌతుందని కాంగ్రెస్ ప్రత్యక్షంగానే శాసన సభ్యులకు హెచ్చరికలు జారీ చేసింది.

గత నెలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది శాసన సభ్యులు బీజేపీలో చేరారు. 9 మంది శాసన సభ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులు అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగాయ్ కు మనవి చేశారు.

Assembly Speaker disqualifies nine rebel Congress MLAs in Assam

9 మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించామని స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగాయ్ తెలిపారు. అనర్హతకు గురైన వారిలో బోలిన్ చెటియా, ప్రధాన్ బారువా, పల్లబ్ లోచన్ దాస్, రాజెన్ బోర్ ఠాకూర్, పిజూష్ హజారికా, కృపా నాథ్ మల్లా, అబు తాహెర్ బేపారి, బినంద సైకియా, జయంత మల్లా బారువా ఉన్నారు.

గత నెలలో వీరందరూ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 126 మంది ఉన్న అసోం అసెంబ్లీలో 69 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఉన్నారు. మ్యాజిక్ నెంబర్ కంటే ఎక్కువ మంది శాసన సభ్యులు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+