అతను వ్యోమగామి కాదు..అది చంద్రుడి ఉపరితలం కాదు గానీ.. నగర రోడ్ల దుస్థితి!

బెంగళూరు: ఇప్పుడు మీరు చూస్తోన్న ఈ ఫొటోలో గానీ, వీడియోలో గానీ కనిపిస్తున్నది వ్యోమగామి అని, ఆయన నడుస్తున్నది ఏ చంద్రమండలమో లేక అంగారక గ్రహమో అనుకుంటే పొరపడినట్టే. ఆయన వ్యోమగామి కాదు.. అది అంతరిక్ష యానం అంతకంటే కాదు. అచ్చంగా బెంగళూరు నగర రోడ్లు. దారుణంగా మట్టి కొట్టుకునిపోయి, గుంతలు పడి, చంద్రుడి ఉపరితలాన్ని తలపిస్తోన్న సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాలోని రోడ్ల పరిస్థితి అది. రోడ్ల మీద అడుగులోతు గుంతలు పడ్డాయని, వాటిని బాగు చేయండని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మన అధికారుల చెవికి ఎక్కదు. అందుకే- త్రీడీ పెయింటర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు వాసి బాదల్ నంజుండస్వామి చేసిన స్పేస్ వాక్ అది.

బెంగళూరు మార్థహళ్లి పరిసర ప్రాంతాల్లో ఆయన ఈ వీడియోను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. వ్యోమగామిలా దుస్తులను ధరించిన ఆయన.. గుంతలు పడి, వాహనదారులకు నరకాన్ని చూపుతున్న రోడ్లపై ఇలా మూన్ వాక్ చేశారు. లైటింగ్ ఎఫెక్ట్ కోసం రాత్రిపూట ఈ వీడియోను చిత్రీకరించారు. ఇటీవల బెంగళూరులో కురిసిన భారీ వర్షాల ధాటికి రోడ్లు ఛిన్నాభిన్నమైపోయాయి. దారుణంగా తయారయ్యాయి. వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. దీనిపై పలువురు కాలనీ సంఘాల ప్రతినిధులు బృహన్ బెంగళూరు నగర పాలికె (బీబీఎంపీ) అధికారులు, స్థానిక కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనితో ఈ సారి బాదల్ నంజుండస్వామి రంగంలోకి దిగారు. తనదైన శైలిలో త్రీడీ పెయింట్ తో గుంతలు పడ్డ రోడ్డును చంద్రుడి ఉపరితలంలా మార్చేశారు.

Astronaut walks on surface not on moon But in Bengaluru path holes road

వ్యోమగామిలా దుస్తులు ధరించి, అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ అచ్చం చంద్రుడిపై నడుస్తున్న అంతరిక్ష పరిశోధకుడిలా కనిపించారాయన. ఓ సాధారణ సామాజిక అంశానికి తన సృజనాత్మకను జోడించి, ఓ 55 సెకెన్ల నిడివి ఉన్న వీడియోను చిత్రీకరించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. బీబీఎంపీ అధికారులకు ఈ వీడియోను ఆయన ట్యాగ్ చేశారు. బీబీఎంపీ అధికారుల నిర్లక్ష్యం, గుంతలు పడ్డ రోడ్లపై త్రీడీ పెయింటింగులను వేసి, వాటిని అధికారుల దృష్టిని ఆకర్షించేలా చేయడం బాదల్ నంజుండస్వామికి కొత్తేమీ కాదు. ఇదివరకు బెంగళూరులోనే గుంతుల పడ్డ రోడ్లను సముద్రాలుగా చిత్రీకరించిన ఘనత ఆయన సొంతం. మత్స్యకన్యలు, మొసళ్లను సైతం ఆయన తన కుంచె నుంచి జాలువార్చారు. సమస్య సత్వర పరిష్కారానికి తనవంతు కృషి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+