అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం: నిరాశే మిగిలింది. శాశ్వతంగా రద్దు చెయ్యండి, శశికళ స్కెచ్ !

అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఎవరికి చెందుతుందోనని ఎదురు చూసిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరాశే ఎదురైయ్యింది.

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఎవరికి చెందుతుందోనని ఎదురు చూసిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరాశే ఎదురైయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గంలో ఎవరికో ఒకరికి రెండాకుల చిహ్నం కేటాయిస్తారని అందరూ ఎదరు చూశారు.

చివరికి రెండు వర్గాల నాయకుల ఆశల మీద నీళ్లు చల్లిన ఎన్నికల కమిషన్ తుది విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం న్యూఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గం నాయకులు హాజరైనారు.

At EC hearing, VK Sasikala camp urges freezing Twin leaves symbol permanently

పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం తరపున తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ. షణ్ముగం, ఎంపీ మైత్రేయన్, మాజీ మంత్రి కేపీ. మునిస్వామి, మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ హాజరైనారు. శశికళ, టీటీవీ దినకరన్ వర్గం నుంచి అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరు మంది ఎంపీలు హాజరైనారు.

రెండాకుల చిహ్నం మాకే కేటాయించాలంటూ రెండు వర్గాలు ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించారు. చివరికి వీరి ఒత్తిడి తట్టుకోలేని ఎన్నికల కమిషన్ తుదివిచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం దక్కదనే అనుమానాంతో ఆ గుర్తును శాశ్వతంగా రద్దు చెయ్యాలని శశికళ, టీటీవీ దినకరన్ వర్గం ఎన్నికల కమిషన్ ముందు డిమాండ్ చేసిందని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోని మాజీ మంత్రి కేపీ. మునిస్వామి, ఎంపీ మైత్రేయన్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+