మోడీ నినాదాలు మీ ఆకలిని తీర్చదు: కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం పాల్గొన్న సమావేశంలో.. మోడీ నినాదాలు వినిపించాయి. కేజ్రీ పాల్గొన్న సభలో పలువురు ప్రధాని మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం పాల్గొన్న సమావేశంలో.. మోడీ నినాదాలు వినిపించాయి. కేజ్రీ పాల్గొన్న సభలో పలువురు ప్రధాని మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. మీ మోడీ నినాదాలు మీ ఆకలిని తీర్చలేవని విమర్శించారు. కొందరు పిచ్చివారిలా మారిపోయారని కేజ్రీవాల్ మండిపడ్డారు.

మోడీ పేరు లేకుండానే కేజ్రీవాల్ ఉపన్యాసం!
ప్రధాని నరేంద్ర మోడీ పేరు లేకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రసంగించారు. కేజ్రీవాల్.. ప్రతి ఇష్యూలోకి మోడీని లాగుతారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని మోడీపై విమర్శలు చేయకపోగా, అసలు ఆయన పేరును కూడా ప్రస్తావించలేదు.
మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అవుటర్ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం కేజ్రీవాల్. ఈ కార్యక్రమంలో దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. కనీసం మోడీ పేరును కూడా పలకలేదు.
ఢిల్లీలో 400 యూనిట్ల కరెంటుకు రూ. 1,370 బిల్లు వస్తుందని, అదే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో రూ. 2,700, ముంబైలో రూ. 4వేల బిల్లు వస్తుందని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రూ. 2,700 బిల్లు వస్తుందని బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications