బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...
పంజాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురుదాస్‌పూర్ లోని బాటాలా ప్రాంతంలోని బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకోవడంతో సుమారు 15 మంది మృత్యువాత పడినట్టు సమాచారం. మరోవైపు ఫ్యాక్టరీలో 50 మంది వరకు చిక్కున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి హుటాహటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అయితే ప్రమాదంలో బాంబులను తయారు చేస్తున్న ఫ్యాక్టీరీ పూర్తిగా దగ్గమైనట్టు అధికారులు తెలిపారు.

జరిగిన ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరిందర్ సింగ్ తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు. కాగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. పూర్తిగా బిల్డింగ్ కూలిపోవడంతో మరింత మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
Gurdaspur Sub-Divisional Magistrate, Deepak Bhatia: 16 people have died and 10 people have been injured in the fire. https://t.co/Uiza9tMNoz
— ANI (@ANI) September 4, 2019












Click it and Unblock the Notifications