వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం 20 మంది మృతి, 10 మందికి గాయాలు

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. బుదవారం నాడు ఓ బాణసంచా ఫ్యాక్టరీలో చోటుచేసుకొన్న అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బోపాల్: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. బుదవారం నాడు ఓ బాణసంచా ఫ్యాక్టరీలో చోటుచేసుకొన్న అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.

fire accident

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలను ఎక్స్ గ్రేషియాగా ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని ఆయన హామీ ఇచ్చారు.

సుమారు 30 నుండి 40 మంది ప్యాక్టరీలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కార్మికుడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సగం కాలిన బీడీని నిర్లక్ష్యంగా బాణసంచా డంప్ లోకి విసరడం వల్లే అది అంటుకొని బారీ పేలుడుతో మంటలు చేలరేగాయని సమాచారం.

English summary
Twenty workers were killed and 10 others injured, two of them critically, in a fire at a cracker factory in Kheri village in Balaghat district this afternoon, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X