ఘోరం: హైటెన్షన్ తీగలు తెగిపడి 25 మంది మృతి
జైపూర్: రాజస్ధాన్‌లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంట్ వైరు తీగలు తెగి పడ్డాయి. దీంతో బస్సులో మంటలు చేలరేగాయి. ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి.
ఈ ఘటనలో 18మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ దుర్ఘటన టోంక్ జిల్లాలోని పచేవార్ గ్రామ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది.

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 50 మందితో కూడిన ఓ ప్రైవేట్ బస్సు పెళ్లికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రేఖా గుప్తా, ఎస్పీ దీపక్ కుమార్ సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఇంకా పెరిగే అవశాకం ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications