చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి మృతి, రాళ్ల వర్షం, 80 కేసులు, మెరీనా బీచ్ లో తొక్కిసలాట, వీవీఐపీలు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్, కలైంజ్ఞర్ డాక్టర్ ఎం. కరుణానిధి ఆకస్మిక మృతిని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు ఆ రాష్ట్రంలో హింస చోటుచేసుకుంది.

Recommended Video

ఇదీ క‌ళైంగ‌ర్‌ క‌రుణానిధి కుటుంబం: అన్నదమ్ముల బలం ఎంతకాలం నిలబడునో???

కరుణానిధి మరణించారని, బంద్ చెయ్యాలని కొందరు రాళ్ల దాడులకు పాల్పడటంతో పోలీసులు ఇప్పటి వరకూ దాదాపు 80 కేసులు నమోదు చేశారు. చెన్నై నగరంలోని మెరీనా బీచ్ లో పెరియార్ స్మారకం సమీపంలో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహిస్తారని బుధవారం డీఎంకే కార్యకర్తలు తెలుసుకున్నారు.

At least 80 cases have been registered for violence in Tamil Nadu

కరుణానిధి అంత్యక్రియలు చూడటానికి ఇప్పటి నుంచి డీఎంకే కార్యకర్తలు మెరీనా బీచ్ లోని పెరియార్ స్మారకం దగ్గరకు పరుగు తీశారు. ఒక్కసారిగా వేలాధి మంది కార్యకర్తలు మెరీనా బీచ్ లోకి రావడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో అనేక మందికి తీవ్రగాయాలైనాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని అనేక జిల్లాల నుంచి డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.

At least 80 cases have been registered for violence in Tamil Nadu

కరుణానిధికి అంతిమ వీడ్కోలు పలకడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీవీఐపీలు చెన్నై చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ఉండాలని కరుణానిధి కుటుంబ సభ్యులు డీఎంకే కార్యకర్తలకు పదేపదే మనవి చేస్తున్నారు.

English summary
At least 80 cases have been registered for violence and two were badly injured in stampede in Chennai day after former chief minister M. Karunanidhi demise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X