Atiq Ahmed:భారత్ పై దాడులు తప్పవు.. అతీక్ అహ్మద్ హత్యపై ఆల్‌ఖైదా స్ట్రాంగ్ వార్నింగ్..!
లక్నో: రంజాన్ వేళ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గ్యాంగ్స్‌టర్ అతీక్ అహ్మద్ అతని సోదరుడు ఆష్రఫ్‌ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈద్ సందర్భంగా లేఖ విడుదల చేసింది. భారత్ పై దాడి చేస్తామంటూ అందులో పేర్కొంది. మరోవైపు అతీక్ అహ్మద్ సోదరులను అమరవీరులుగా పేర్కొంది.
మొత్తం ఏడు పేజీలతో ఉన్న లేఖను ఆల్ ఖైదా తమ అనుకూల మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ముస్లింలకు విమోచన కల్గిస్తామంటూ సీరియస్‌గా చెప్పింది. ఇకపై భారత్‌ను వదిలేది లేదంటూ హెచ్చరించిన ఆల్ ఖైదా ఏ క్షణమైనా దాడులు నిర్వహిస్తామని వెల్లడించింది. ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని ఈ ఉగ్రవాద సంస్థ హామీ ఇచ్చింది.

అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్‌లను అమరవీరులుగా అభివర్ణించిన ఆల్ ఖైదా సంస్థ ఇక భారత్‌కు తామేంటో చూపుతామని వెల్లడించింది. ఇదిలా ఉంటే అతీక్ అహ్మద్‌కు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుండేవని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదానికి, అండర్ వరల్డ్ మాఫియాకు చోటు లేదని త్వరలోనే మట్టుబెడతామంటూ యోగీ సర్కార్ హెచ్చరించింది. అయితే అతీక్ సోదరులను మాత్రం ముగ్గురు యువకులు తుపాకులతో కాల్చి హత్య చేశారు.
సరిగ్గా వారం రోజుల క్రితం హెల్త్ చెకప్ కోసం ప్రయాగరాజ్‌లోని ఓ హాస్పిటల్‌కు అతీక్ సోదరులను పోలీసులు తీసుకొచ్చారు. అనంతరం హతులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు యువకులు వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి హత్య చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆ సమయంలో అతీక్ సోదరులను హెల్త్ చెకప్‌కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అనే దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications