స్టేటస్ రిపోర్ట్ కోరిన సుప్రీం: యోగి సర్కార్‌కు సంచలన ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాది పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ దారుణ హత్యోదంతంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి జోక్యం చేసుకుంది. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇవ్వాళ్టి నుంచి విచారణ మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ జంట హత్యలపై సమగ్రంగా విచారణ చేపట్టనుంది.

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ.. ఈ పిల్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై ముగ్గురు వ్యక్తులు ప్రయాగ్ రాజ్‌లోని ఓ ఆసుపత్రి వద్ద అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

Why the vehicle was not taken directly to the hospital?, SC questioned

ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం.. ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల వైఫల్యాన్ని చాటుతోందంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వతంత్రంగా పని చేసే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు కావాలని కోరారు.

విచారణ సందర్భంగా విశాల్ తివారీ తన వాదనలను వినిపించారు. 2017 నుంచి ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో 183 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయని, అందులో ఫేక్ ఎన్‌కౌంటర్లే అధికంగా ఉన్నాయని విశాల్ తివారీ చెప్పారు. వాటన్నింటిపైనా సీబీఐ అధికారులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపించారు.

వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. వాటన్నింటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమాధానాలను ఇవ్వాలని ఆదేశించింది. అతిక్ అహ్మద్-అష్రాఫ్ అహ్మద్‌లను తరలించడానికి వినియోగించిన పోలీసు వాహనాన్ని నేరుగా ఆసుపత్రిలోకి ఎందుకు తీసుకెళ్లలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది.

ఆసుపత్రి ఆవరణ బయట వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి వారిని ఎందుకు లోనికి నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చిందో వివరించాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశిచింది ధర్మాసనం. పోలీసులు వారిని అలా తీసుకెళ్లడం వల్లే నిందితులు వారిపై కాల్పులు జరిపినట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. దీనిపై ఓ సమగ్రమైన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సూచించింది.

అసద్ ఎన్‌కౌంటర్‌పైనా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటు చేసిన జస్టిస్ బీఎస్ చౌహాన్ కమిటీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనికి ముకుల్ రోహత్గీ సమాధానాలను ఇచ్చారు. దీనిపై విచారణను జరిపించడానికి ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+