బెంగళూరుకు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్... ఐదు రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్...

కర్ణాటకలోని బెంగళూరులో గడిచిన ఐదు రోజుల్లో 242 మంది చిన్నారులు కోవిడ్ బారినపడ్డారు. వీరంతా 19 ఏళ్లు లోపు వారేనని బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) అధికారులు తెలిపారు. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందనే హెచ్చరికలు,అనుమానాల నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.

బీబీఎంపీ డేటా ప్రకారం... కరోనా బారినపడిన 242 మందిలో 106 మంది 19 ఏళ్ల లోపు వారు కాగా 136 మంది 9 నుంచి 19 ఏళ్లు లోపు వారు. రాబోయే రోజుల్లో మరింతమంది చిన్నారులు కరోనా బారినపడవచ్చునని కర్ణాటక ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆ శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. 'ఇప్పుడున్న సంఖ్య మరికొద్దిరోజుల్లోనే మూడు రెట్లకు పెరగవచ్చు.కాబట్టి మన ముందు పెద్ద ప్రమాదమే ఉంది. మనం చేయాల్సిందల్లా... పిల్లలను ఇంట్లోనే ఉంచి వారి కాపాడుకోవడం. పెద్దలతో పోలిస్తే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అంతగా ఉండదు. కాబట్టి చిన్నారులను ఇళ్లల్లోనే ఉంచాలి.' అని సూచించారు.

atleast 242 child tested covid positive in bengaluru within five days

ప్రస్తుతం కర్ణాటకలో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూ అమలవుతోంది. కేరళ,మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలపై ఆంక్షలు విధించారు. 72 గంటల వ్యవధిలో చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ చూపించినవారిని మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు.గత నెలలో సగటున రోజుకు 1500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నెలకు 65 లక్షల డోసుల వ్యాక్సిన్లు వేస్తుండగా దాన్ని కోటి డోసులకు పెంచుతామని నూతన సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవల ప్రకటించారు.కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కర్ణాటకలో అగస్టు 16 నుంచి మళ్లీ లాక్‌డౌన్ విధించవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

డా.బకుల్ జే పరేఖ్,డా.సమీర్ దల్వాయ్ అనే వైద్య నిపుణులు రాసిన ఒపీనియన్ పీస్‌లో థర్డ్ వేవ్‌పై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఏడాది మార్చి,ఏప్రిల్ మాసాల్లో నమోదైన కేసుల్లో చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని... కాబట్టి వారికి కూడా వ్యాక్సిన్లు వేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు.

మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం... కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.

కాగా,దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా గత నెలలో వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+