కూటమి మహిళా నేతపై దాడి..కూర్చీలు విసిరి మరీ
నవనీత్ రాణా ఒక వివాదాస్పద రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. నవనీత్ రాణా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. యువ స్వాభిమాన్ పార్టీ అభ్యర్థి రమేష్ బండిలేకు మద్దతుగా నవనీత్ రాణా దర్యాపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఖల్లార్ గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నవనీత్ రాణాపై కొందరు దాడికి యత్నించారు.నవీనీత్ రాణా వైపుగా కుర్చీలు విసిరారు.
పలు కుర్చీలు ఆమెకు దగ్గర్లోనే పడటంతో ఆందోళన నెలకొంది. దీంతో ఆమె మద్దతు దారులు తనకు రక్షణగా నిలబడ్డారు. ఈ ఘటనపై ఖల్లార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఖల్లార్ లో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు. ప్రచారసభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు.

వారంతా ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారని దుయ్యబట్టారు. తనను దూషించారని, కొందరు తనపై ఉమ్మివేశారని తెలిపారు. తన గన్ మన్లు తనను కాపాడి అక్కడి నుంచి తీసుకువచ్చారని చెప్పారు. ఘటనలో పలువురు పార్టీ కార్యకర్తలకు గాయాలైనట్టు ఆమె వెల్లడించారు గత నెలలోనూ నవీనత్ రాణాలు బెదిరింపులు ఎదురయ్యాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిందితులు ఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి దాడి జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications