ఐటీ అడ్డాలో 'లోకల్' వివాదం: తెలుగు టెక్కీలపై బెంగుళూరులో విద్వేష దాడి..

Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: ఎక్కడో అమెరికా దాకా ఎందుకు? మన పక్కనున్న బెంగుళూరులోనే విద్వేష దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఉద్యోగ రీత్యా బెంగుళూరులోని మున్నేకొలాల ప్రాంతంలోని హాస్టల్స్ లో ఉంటున్న తెలుగువారిని కొంతమంది స్థానిక యువకులు బెంబేలెత్తిస్తున్నారు. రాత్రిపూట కర్రలతో హాస్టల్స్ లో చొరబడుతూ వారిపై దాడులకు తెగబడుతున్నారు.

శుక్రవారం రాత్రి తెలుగువాడైన ఒక టెక్కీపై జరిగిన దాడితో ఈ విద్వేష దాడులు శృతిమించాయి. బెంగుళూరులో టెక్కీగా పనిచేస్తున్న ఓ తెలుగు వ్యక్తి ఆఫీస్ నుంచి హాస్టల్ కు తిరిగి వెళ్తున్న సమయంలో.. ఇద్దరు స్థానికులు నిర్లక్ష్యంగా బైక్ నడుపుకుంటూ వచ్చి అతన్ని ఢీకొట్టారు. దీంతో ఆగ్రహించిన బాధితుడు వారితో వాగ్వాదానికి దిగగా.. బయటినుంచి వచ్చిన నీకే ఇంత ధైర్యమా? అని అతన్ని చితకబాదారు.

Attack on telugu it professionals in bengaluru

నానా దుర్భాషాలాడుతూ అతన్ని తీవ్రంగా కొట్టారు. అయితే దాడి విషయం గమనించిన చుట్టుపక్కల స్థానికులు, హాస్టల్స్ లోని తెలుగువారు సదరు యువకులిద్దరిని కొట్టి, వారిని అక్కడినుంచి పంపించి, బాధితుడిని రక్షించారు. అయితే దాడికి పాల్పడిన యువకులు ఇద్దరు విద్వేషపూరితంగా వ్యవహరించడంతో రాత్రంతా హాస్టల్స్ లో ఉన్న తెలుగువారంతా బిక్కుబిక్కుమని గడిపారు.

అనుకున్నట్లుగానే అదేరోజు రాత్రి 40మంది స్థానికులను వెంటేసుకుని వచ్చిన యువకులు హాస్టల్స్ లోని తెలుగువారిని బెదిరించారు. ఇక ఆ మరుసటిరోజు శనివారం కొంతమంది యువకులు కార్లలో అక్కడికి వచ్చి హల్ చల్ చేశారు. స్థానిక కాలనీలోని ఇళ్లల్లో లైట్లు బంద్ చేయించారు. అనంతరం ప్రతీ హాస్టల్ కు వెళ్లి అనుమానం వచ్చిన వారందరిని చితకబాదారు.

స్థానిక యువకులు చేసిన ఈ దాడిలో దాదాపు 50మంది తెలుగువారు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దాడి అనంతరం అక్కడి తెలుగువారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సైతం వారు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోమవారం నాడు అక్కడి అన్ని ప్రధాన ఐటీ కార్యాలయాల్లో దీనిపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మున్నేకొలాలలో ఏడాదికాలంగా స్థానిక యువతకు, తెలుగు టెక్కీలకు మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సందర్బంగా ఇక్కడి తెలుగువారు చేస్తున్న హడావుడి స్థానిక కన్నడిగులకు నచ్చడం లేదని చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On saturday night few of the local bengaluru candidates attacked on telugu techies who were staying in local hostels
Please Wait while comments are loading...