విద్యార్థినిపై కామాంధుల కన్ను, తమ్ముడి హత్య, బాలిక, ఆమె తల్లి మీద, దారుణంగా!
చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. దళిత కుటుంబంపై దాడి చేసిన కామాంధులు బాలికను నగ్నంగా చేసి తరువాత అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించి ఆమె తల్లి మీద దాడి చేసి 8 సంవత్సరాల బాలుడిని హత్య చేసి పరారైనారు. బాలిక, ఆమె తల్లికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసులు హంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

దళిత కుటుంబం
విల్లుపురం జిల్లాలోని వెల్లుపురం గ్రామంలోని ఫాం హోస్ సమీపంలోని ఇంటిలో గీతా (45 పేరు మార్చాం) అనే మహిళ కుమార్తె (14), కుమారుడు (8)తో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త చనిపోవడంతో గీతా వ్యవసాయం చేస్తూ బిడ్డలను పోషించుకుంటున్నది.

ప్రభుత్వ పాఠశాల
గీతా కుమార్తె దేవనూరులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గీతా కుమారుడు వెల్లుపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. తల్లి గీతాకు కుమార్తె, కుమారుడు వ్యవసాయం పనులల్లో సహాయం చేస్తున్నారు.

స్థానికులకు అనుమానం
గీతా, ఆమె కుమార్తె, కుమారుడు గురువారం రాత్రిపొద్దుపోయే వరకూ ఇంటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. రాత్రి గ్రామస్తులు గీతా వ్యవసాయ పోలం దగ్గరకు వెళ్లి చూడగా షాక్ కు గురైనారు.

బాలిక నగ్నంగా
గీతా, ఆమె కుమార్తె తీవ్రగాయాలై పడి ఉన్న విషయం గుర్తించారు. గీతా కుమార్తె నగ్నంగా ఉంది. గీతా కుమారుడు హత్యకు గురైనాడని గుర్తించిన స్థానికులు అరకనందళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గీతా, ఆమె కుమార్తెను తిరుకోయిళూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాలికపై అత్యాచారం !
బాలిక పూర్తిగా నగ్నంగా ఉందని, బాలికతో పాటు ఆమె తల్లి మీద దాడి చేసి ఆమె బట్టలులాగేసి ఉన్నారని, అత్యాచారం జరిగి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గీతా కుమారుడి మృతదేహాం విల్లుపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల ఆందోళన
దళిత కుటుంబ సభ్యుల మీద దాడి చేసి బాలుడిని హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చెయ్యాలని స్థానికులు ఆందోళనకు దిగారు. అరకనందళూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ లు జయవేల్, రతనిసభాపతి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications