అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి!: బీజేపీ పనేనంటూ ఆప్ ఆరోపణ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి యత్నం జరిగింది. శుక్రవారం వికాస్‌పురిలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. కొందరు బీజేపీ గూండాలు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ గూండాలు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ పై దాడికి యత్నించినా.. పోలీసులు వారిని అడ్డుకోలేదని ఆరోపించారు.
తమ నేతపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ, జైలుతో అరవింద్ కేజ్రీవాల్ ను అణిచివేయాలని ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో బీజేపీకి చెందినవారు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి యత్నించారని ఆరోపించారు. కేజ్రీవాల్‌కి ఏదైనా జరిగితే బీజేపీనే బాధ్యత వహించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భద్వాజ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ శత్రువుగా మారారు. మొదట ఈడీ, సీబీఐని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెట్టారు. ఇన్సులిన్ ఆపేసి చంపాలని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో ఇప్పుడు బీజేపీ గూండాలు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేశారు. కేజ్రీవాల్ ను బీజేపీ చంపేయాలని చూస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కు ఏం జరిగినా బీజేపీదే బాధ్యత అని మరో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి బీజేపీని ఘాటుగా హెచ్చరించారు. 'అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే ఢిల్లీ ప్రజలు ఎప్పటికీ క్షమించరని నేను బీజేపీకి చెప్పాలనుకుంటున్నాను' అని అతిషి తన ప్రసంగంలో బీజేపీకి తీవ్ర హెచ్చరిక చేశారు. ఇలాంటి హెచ్చరిక ఢిల్లీలోని ఉద్రిక్త రాజకీయ వాతావరణాన్ని, తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకున్న దాడికి వ్యతిరేకంగా నిలబడాలనే ఆప్ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.
What's Happening in Our Country? #ArvindKejriwal got slapped in Public by Public but Still He Stand by Public That's what he is.
— Dhruv (Parody) (@_dhruv_101) October 25, 2024
But what about the general public? But this is very condemnable and worrying #KejriwalAttackedByBJP#AttackOnKejriwal #Delhi pic.twitter.com/19McOXdgBE
30 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను అందించడానికి బీజేపీ నిరాకరించడంతో పాటు ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిషి వెల్లడించారు. AAP కార్యకర్తల భారీ నిరసనలు, ఢిల్లీ హైకోర్టు జోక్యం తర్వాత మాత్రమే కేజ్రీవాల్‌కు అవసరమైన వైద్య చికిత్స అందించారన్నారు. ఈ చర్యలు బీజేపీచే ప్రమాదకర స్థాయిని పెంచడంలో భాగమని ఆప్ ఆందోళనను అతిషి ఉదహరించారు. తాజాగా, కేజ్రీవాల్‌పై బీజేపీ హత్యాయత్నానికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
#ArvindKejriwal got slapped in 2014 then 2019 and now it's 2024 & AAP accuses #AttackOnKejriwal. He orchestrates a attack perfectly at a gap of 5 years just before Delhi Assembly polls.People have got enough of his nautanki and it won't sell anymore.#KejriwalAttackedByBJP pic.twitter.com/kGWq6aCwNI
— vikram choudhary (@vikram_bugasara) October 25, 2024
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అరవింద్ కేజ్రీవాల్ మరో నాటకానికి తెరతీశారని ఆరోపించారు. 2014, 2019 ఎన్నికల ముందు కూడా ఇలాంటి దాడులే జరిగాయన్నారు. ఇప్పుడు ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో మరోసారి ఇలాంటి దాడి ఘటన చోటు చేసుకోవడం కేజ్రీవాల్ కొత్త నాటకానికి నిదర్శనమని మండిపడుతున్నారు. కాగా, కేజ్రీవాల్‌పై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications