అంత్యక్రియలకు వేలం పాట: అనూహ్యంగా రూ.33కోట్లకు దక్కించుకున్న వ్యాపారి

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: జైనుల సాంప్రదాయం ప్రకారం పరమపదించిన గురువు అంత్యక్రియలకు వేలం నిర్వహిస్తారు. వేలంలో ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లించడానికి ముందుకొస్తారో.. వారికే దహన సంస్కరాలు నిర్వహించే అవకాశమిస్తారు.

మూడు రోజుల క్రితం పరమపదించిన గురువు జయంత్ సేన్ సురీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్(81) అంత్యక్రియలకు కూడా వేలం పాట నిర్వహించారు. అనూహ్యంగా గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి రూ.33.5కోట్లు చెల్లించి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం దక్కించుకున్నాడు.

auction for Acharya jayant sen suri maharaj saheb funeral

ఇక గురూజీ పార్థివ దేహానికి చేయించే అఖరి స్నానం చేయించడం, గంధం పూయడం వంటి కార్యక్రమాల కోసం నిర్వహించిన వేలంలోను రూ.57కోట్లు జమ అయినట్లు సమాచారం. జైన గురువుల అంత్యక్రియల వేలం వారి అనుచర గణం, శిష్య గణం మీద ఆధారపడి ఉంటుంది. వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఈ క్రతువుకు అంత భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది.

అలాగే ఎంతమందికి జైన దీక్షను ఇచ్చారన్న దానిపై వారి పేరు ప్రఖ్యాతులు ఆధారపడి ఉంటాయి.జయంత్ సేన్ సురీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్ దాదాపు 200మంది శిష్యులకు జైన దీక్షను ఇచ్చినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Acharya Jayant sen suri maharaj saheb(81) was died on last monday. Auction was held for his funeral
Please Wait while comments are loading...