అల్లుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మేనత్త.. తర్వాత ఏం చేసిందంటే ?
నానాటికీ మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరుసలు సైతం మర్చిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే చిన్న చిన్న కారణాలు కాస్తా మనిషిని హతమార్చే వరకు రావడం.. ఆ తర్వాత ఆ మృతుదేహాన్ని మాయం చేయడం కోసం కొత్త కొత్త ప్లాన్స్ వేయడం ప్రస్తుత కాలంలో పరిపాటిగా మారింది. మేనల్లుడుతో శారీరిక సంబంధం కొనసాగిస్తున్న మేనత్త.. అతడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపడమే కాకుండా ఆ భాగాలను సిమెంట్ తో కలిపి కప్పేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మాల్డాకు చెందిన మౌమితా హసన్ నదాబ్ అనే మహిళ తన మెనల్లుడు సద్దాం నదాబ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ సంబంధం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండగా.. సద్దాం తరచూ మౌమితను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తుంది.

అయితే మే 18న సద్దాం కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మౌమితను విచారించిన తర్వాత.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సద్దాం మృతదేహాన్ని మౌమిత మూడు ముక్కలుగా నరికి, సిమెంట్‌లో కూర్చి తన తండ్రి ఇంట్లోని గోడల్లో కప్పిపెట్టినట్లు అంగీకరించింది. ఇది తపన్ ప్రాంతంలోని దినాజ్‌పూర్ జిల్లా పరిధిలోని ఇంటిలో జరిగింది.
కాగా సద్దాం ఓ లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ లక్షల రూపాయల లావాదేవీలను నిర్వహించేవాడు. అతడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు సమాచారం. ఈ డబ్బు విషయమే హత్యకు ముఖ్యమైన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మౌమిత తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అనే కారణానే చంపినట్టు చెప్పినా, ఆర్థిక లావాదేవీల వెనక దాగిన రహస్యాలను గుర్తించేందుకు పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. మౌమితకు హత్యకు సహకరించడానే అనుమానంతో ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications