ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం : భారత్ నుండి వస్తే ఐదేళ్ళు జైలుకు, రూ.38 లక్షల జరిమానా!!

కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న భారతదేశం నుండి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే. స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేసేవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని వెల్లడించింది లేదా ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. సోమవారం నాటికి ఆస్ట్రేలియాలో భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులను నిషేధిస్తారు. ఒకవేళ అలా కాకుండా రావాలని ప్రయత్నం చేసిన వారికి జరిమానాలు మరియు జైలు శిక్షలు పడుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు ప్రయాణికులపై కఠిన ఆంక్షలు, మే 3 నుండి అమల్లో

భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు ప్రయాణికులపై కఠిన ఆంక్షలు, మే 3 నుండి అమల్లో

ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక అత్యవసర నిర్ణయం, ఆస్ట్రేలియా తన పౌరులు భారతదేశం నుండి స్వదేశానికి తిరిగి రావడం పెద్ద నేరంగా భావిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కోవిడ్ 19 కేసులు మరియు మరణాల పెరుగుదలతో పోరాడుతున్నందున ప్రపంచంలోని రెండవ అత్యధిక జనాభా కలిగిన భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు ప్రయాణికులను ఆపడానికి కఠినమైన చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈ ఆంక్షలు మే 3 నుండి అమల్లోకి వస్తాయి .

ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 38 లక్షల జరిమానా : ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్

ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 38 లక్షల జరిమానా : ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్

నిషేధాన్ని ఉల్లంఘిస్తే పౌర జరిమానాలు మరియు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, రూ.38 లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం ఈ నిర్ణయాలను తేలికగా తీసుకోదని హంట్ అన్నారు. అంతేకాదు మే 15 న ప్రభుత్వం ఆంక్షలను పునఃపరిశీలించాల్సి ఉందని స్పష్టం చేశారు.భారతదేశం నుండి తిరిగి వచ్చిన ఆస్ట్రేలియన్లను నేరం చేసినట్లుగా తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాదని భారతదేశంలో కుటుంబంతో ఉన్న ఆస్ట్రేలియా సర్జన్ నీలా జానకిరామనన్ అన్నారు.

స్వదేశీ పౌరులపైనే ఆస్ట్రేలియా ఆంక్షలు

స్వదేశీ పౌరులపైనే ఆస్ట్రేలియా ఆంక్షలు

భారత్లో ప్రస్తుతం 9 వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లుగా అంచనా.విదేశాల నుంచి వచ్చే స్వదేశీ పౌరులపై క్రిమినల్ చర్యలు ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ప్రకటించడం ఇంతకుముందెప్పుడూ జరగలేదని ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది.భారతీయ-ఆస్ట్రేలియన్లు దీనిని జాత్యహంకార విధానంగా చూస్తున్నారు. ఎందుకంటే యుఎస్, యుకె మరియు యూరప్ వంటి దేశాలలో కరోనా వ్యాప్తి కలిగి ఉన్న ఇతర దేశాల ప్రజల కంటే, భారతదేశం నుండి వచ్చే ప్రజలపై భిన్నంగా ఆస్ట్రేలియా దేశం స్పందించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశంలో 9,000 మంది ఆస్ట్రేలియన్లు, వారిలో 650 మంది బలహీనం

భారతదేశంలో 9,000 మంది ఆస్ట్రేలియన్లు, వారిలో 650 మంది బలహీనం

మానవ హక్కుల సంఘాలు కూడా నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శిక్షలపై కాకుండా కరోనా నియంత్రణ వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారంటున్నారు. ఇది దారుణమైన ప్రతిస్పందన. ఆస్ట్రేలియన్లకు తమ దేశానికి తిరిగి వచ్చే హక్కు ఉంది అని హ్యూమన్ రైట్స్ వాచ్ యొక్క ఆస్ట్రేలియా డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లు లేని ఆస్ట్రేలియా, మంగళవారం నుండి మే మధ్య వరకు భారతదేశం నుండి ప్రత్యక్ష విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మంగళవారం ఈ చర్య వల్ల భారతదేశంలో 9,000 మంది ఆస్ట్రేలియన్లు చిక్కుకుపోయారు, వారిలో 650 మంది బలహీనంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+