శభాష్ గోపి: రూ.10 వేలు, పొరపాటున రావడంతో పంపించేసి.., సీపీకి లేఖ
ఇప్పుడు అంతా యూపీఐ.. అవును ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. చాయ్ నుంచి రాత్రి తాగే పెగ్ వరకు అంతా యూపీఐ చెల్లింపులే.. టాక్సీ, ఆటోలు కూడా యూపీఐ యూజ్ చేస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో ఇవీ తక్కువేం కాదు. అయితే ఇక్కడ ఆటోవాలాలకు డిమండ్ ఎక్కువ అని ప్రచారం ఉంది. అంతా అదేవిధంగా కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఆ అపప్రదను ఓ డ్రైవర్ చెరిపివేశాడు. తనకు అనుకోకుండా వచ్చిన రూ.10 వేల నగదును తిరిగి కస్టమర్‌కు పంపించి తన మంచితనన్నా చాటుకున్నారు.

ఆటోలో పయనం..
ఐటీ కన్సెల్టెంట్, న్యాయవాది శివకుమార్ ఆనంద్ రావు సర్కిల్ నుంచి ఆటోలో ప్రయాణించి రాజాజీనగర్ వెళ్లాడు. ఆటో ఫేర్ రూ.120 కావడంతో ఆ సొమ్మును యూపీఐ ద్వారా గోపికి పంపించాడు. తర్వాత కొద్ది సేపటికి శివకుమార్ ఫ్రెండ్ ఒకరికి రూ.10,000 అవసరం వచ్చింది. అదే యాప్ ద్వారా డబ్బులు పంపమని అతను శివకుమార్‌ను కోరాడు. శివకుమార్ ఆ సొమ్మును పొరపాటున గోపికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును తెలుసుకుని అంతపెద్ద మొత్తం ఎలా తిరిగివస్తుందనే ఆందోళనకు గురయ్యాడు.

ఫోన్ రావడంతో..
ఆటోలో వేరే ప్యాసింజర్‌ను తీసుకు వెళ్తుండగా కుమార్ నుంచి ఫోన్ వచ్చిందని గోపి తెలిపాడు. తర్వాత ఫోన్‌లో బ్యాలెన్స్ చూసుకోగా..ఉండాల్సిన సొమ్ము కన్నా ఎక్కువ ఉన్నట్టు గమనించానని తెలిపారు. డబ్బులు వచ్చినట్టు కుమార్‌కు వెంటనే చెప్పానని.. ఆ అప్లికేషన్ సొంతంగా ఉపయోగించి పంపించాలో తెలియకపోవడంతో.. వేరేవారి సాయం తీసుకుని ఆ డబ్బులు కుమార్‌కు పంపేశారు. డబ్బులు అందాయని అతను చెప్పాడు. ఆటో డ్రైవర్ గోపి నిజాయితీని కుమార్ అభినందించారు.
Recommended Video

సీపీకి లేఖ
ఆటో డ్రైవర్ నిజాయితీని వివరిస్తూ సిటీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశాననీ వివరించారు. నిజాయితీ కలిగిన వ్యక్తులను గౌరవించి, వారిని అందరికీ తెలియజేసినప్పుడే వారి నుంచి సమాజం కూడా మంచి పాఠాలు నేర్చుకుంటుందని ఆయన ప్రశంసలు కురిపించాడు. ఇటు ఒక్కోసారి ఇంటి అద్దె కూడా ఇవ్వలేకపోయేవాడినని గోపి తెలిపారు. ఇంకొకరు కష్టపడిన సొమ్ము తనకు అవసరం లేదని చెప్పారు. మనం కష్టపడినప్పుడే ఇతరులు కూడా మనను చూసి నేర్చుకుంటారని వివరించారు. హెవీ వెహికల్స్ నడిపేవాడినని, కరోనా వల్ల ట్రాన్స్‌పోర్ట్ పని లేకపోవడంతో ఆటో నడుపుతున్నట్టు చెప్పాడు. కానీ అతను చేసిన పనిని అంతా అభినందిస్తున్నారు. శభాష్ గోపి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications