Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రయాంగిల్ లవ్ స్టోరీ:భర్తను ప్రియుడితో హత్య చేసిన భార్య

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోయింది. వివాహమైన తర్వాత కూడ ఆమె అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. వీరిద్దరూ కలిసి భర్తను హత్య చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకొంది.

చెన్నై :ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోవడం కుదరలేదు. తనను ప్రేమించిన మరో వ్యక్తితో వివాహమైంది..వేరే వ్యక్తితో వివాహమైన ప్రియుడిని మాత్రం మర్చిపోలేదు. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలో చెన్నై లోని వ్యాసార్పాడి కన్నదాసన్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ ను ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేసింది. అయితే ఏమి తెలియనట్టుగానే తన భర్య కనిపించడం లేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆదారంగా విచారణ చేపట్టిన పోలీసులు భార్యే నిందితురాలుగా తేల్చారు.

autodriver murder by her wife in chennai

ప్రవీణ్ ఆటోను నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆరు మాసాల క్రితం తాను నివాసం ఉండే ప్రాంతానికి చెందిన తఫానా అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. అయితే తఫానాకు ప్రవీణతో వివాహం కాకముందే గణేష్ అనే వ్యక్తిని ప్రేమించింది.

గణేష్ ను ప్రేమించి ప్రవీణ్ ను ప్రేమ వివాహం చేసుకొంది. ప్రవీణ్ తో వివాహం అయిన తర్వాత గణేష్ తో ఆ ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. దీంతో ఆమె భర్త ప్రవీణ్ ను హత్య చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రియుడు గణేష్ సహయంతో భర్త ప్రవీణ్ ను హత్య చేశారు. హత్య చేసి శవాన్ని గోనెసంచిలో వేసి ఆటోలో తీసుకెళ్ళి కాలువలో పడేశారు. అయితే మృతదేహన్ని తీసుకెళ్ళిన ఆటోను పుసైవాక్కం రోడ్డు పక్కన వదిలేశారు. అయితే ఈ ఆటో ఆదారంగా పోలీసులు ఈ కేసును చేధించారు.

ప్రవీణ్ భార్య తఫానాపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది. ప్రవీణ్ ను ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఆమె ఒప్పుకొంది.ఆమె ప్రియుడు గణేష్ కు సహకరించిన మరో వ్యక్తిని కూడ పోలీసులు అరెస్టు చేశాు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+