మంచుగడ్డలు కూలిపడటంతో నలుగురు జవాన్లు ఇద్దరు పౌరులు మృతి
సియాచిన్ గ్లేసియర్ వద్ద మంచు కొండలు విరిగి పడటంతో దానికింద చిక్కుకుని నలుగురు జవాన్లు మృతి చెందారు.ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఎనిమిది మంది జవాన్లు ఈ మంచు కొండల కింద చిక్కుకుపోయిన్ట్లు తెలుస్తోంది. లడఖ్ ప్రాంతంలోని సియాచిన్‌లో విపరీతమైన మంచు కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఉత్తర గ్లేసియర్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై మంచుకొండలు విరిగి పడ్డాయి. వెంటనే ఆర్మీ సిబ్బంది చిక్కుకున్న జవాన్లను కాపాడే ప్రయత్నం చేశాయి.
మంచుకొండల శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది జవాన్లను బయటకు తీసింది ఆర్మీ సిబ్బంది. ఇందులో ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం హెలికాఫ్టర్ ద్వారా దగ్గరలోని మిలటరీ హాస్పిటల్‌కు తరలించారు. వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇందులో నలుగురు జవాన్లు మృతి చెందగా ఇద్దరు పౌరులు కూడా చనిపోయినట్లు ఆర్మీ తెలిపింది. సైనికులు చిక్కుకున్న ప్రాంతం19వేల అడుగులకు పైన ఉందని అధికారులు తెలిపారు.

ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలా మంచుగడ్డలు కూలిపడి సైనికులు చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. 1984లో భారత్‌తోపాటు పాకిస్థాన్‌లో కూడా మంచుగడ్డలు కూలి సైనికులను కోల్పోయిందన్న విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. 2016 ఫిబ్రవరిలో మంచుగడ్డ పడిపోయి దాదాపు 10 మంది జవాన్లు చనిపోయిన ఘటన మరవక ముందే మళ్లీ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలోనే లాన్స్ నాయక్ హనుమంతప్ప కోప్పాడ్ 25 ఫీట్ల మంచులో ఇరుక్కున సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో దాదాపు ఆరురోజులు పాటు హనుమంతప్ప మృత్యువుతో పోరాడి చివరికి ఆసువులు బాసారు. హనమంతప్పతోపాటు 10 మంది సైనికులు ఫిబ్రవరి 3వ తేదీన సోనమ్ పోస్ట్ వద్ద గస్తీ కాస్తుండగా మంచు పెళ్ల వారిపై పడింది. అది కూడా దాదాపు 20 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికక్కడే 9 మంది చనిపోగా.. హనుమంతప్ప మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications