రామాలయాన్ని మన ముస్లీంలు కూల్చలేదు: ఆరెస్సెస్ మోహన్ భాగవత్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: భారత్‌కు చెందిన ముస్లీంలు అయోధ్యలోని రామాలయాన్ని కూల్చలేదని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) మోహన్ భాగవత్ అన్నారు. ఆయన పల్‌ఘర్ జిల్లాలో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ఆదివారం మాట్లాడారు.

భారత్‌కు చెందిన జాతీయవాదులు అలాంటి పనులు చేయరని, అందుకే భారతీయ ముస్లీంలు రామాలయాన్ని కూల్చలేదని ఆయన వ్యాఖ్యానించారు. విదేశీ శక్తులు ఆ ఆలయాన్ని కూల్చేశాయని వ్యాఖ్యానించారు.

Ayodhya dispute: RSS chief Mohan Bhagwat says Indian Muslims did not demolish Ram Mandir, vows to fight for it

భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారన్నారు. రామ్ మందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యమని తెలిపారు. అలాగే అయోధ్యలో ధ్వంసమైన రామ్ మందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉందన్నారు.

అందుకోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. అందుకు సిద్ధమని చెప్పారు. రామ్ మందిరాన్ని పునర్మించకపోతే మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ్ మందిర్‌ను యథాస్థానంలో పునర్మిస్తామని చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ్ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Muslims in India did not demolish the Ram Mandir, said Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat while raking up Ayodhya dispute once again on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X