అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో వ్యక్తికి గుండెపోటు
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరైన ఓ భక్తుడికి తృటిలో ప్రాణపాయం తప్పింది. వెంటనే స్పందించిన వాయుసేన (Airforce) అతడి ప్రాణాలు కాపాడింది. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుండగా ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు వచ్చిన రామకృష్ణ శ్రీవాస్తవ (65) అనే భక్తుడికి గుండెపోటు వచ్చింది. మందిర ప్రారంభోత్సవంలో కొంత భావోద్వేగానికి గురికావడంతో ఆయనకు హార్ట్ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది.
వెంటనే స్పందించిన వింగ్ కమాండర్ మనీశ్ గుప్తా నేతృత్వంలో ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు చెందిన భీష్మ్ క్యూబ్ బృందం వెంటనే స్పందించింది. ఘటనా స్థలి నుంచి వెంటనే తరలించి చికిత్స అందించింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌గా పిలిచే తొలి గంటను వాయుసేన బృందం సమర్థంగా వినియోగించుకుందని ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

చికిత్స ప్రారంభించే సమయానికి శ్రీవాస్తవ బీపీ 210/170 వద్ద ప్రమాదకరస్థాయిలో ఉందని తెలిపింది. సత్వరమే చికిత్స అందించడంతో ప్రాణం నిలిచింది. అతడి ఆరోగ్యం నిలకడగా మారిన అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎవరికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే సత్వరమే స్పందించేందుకు వీలుగా ఆరోగ్యమైత్రి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు కింద క్యూబ్-భీష్మ్ పేరిట అయోధ్యలో రెండు మొబైల్ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు.
వీటిలో అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు వీలుగా అత్యాధునిక వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు, ప్రముఖులు రావడంతో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించారు. సోమవారం మధ్యాహ్నం అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications