ఆహ్వానితుల చేతికి గంట: రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన పూర్తయిన మరుక్షణమే..
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ముగిసిన వెంటనే.. హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించనున్నారు ఆర్మీ జవాన్లు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీని కోసం దేశం నలుమూలల నుంచి విభిన్న రకాలకు చెందిన పూలను సేకరించారు.
అదే సమయంలో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఏర్పాటవుతుంది. 30 మంది కళాకారులు రామ నామాన్ని జపిస్తారు. దీనికోసం విభిన్న సంగీత పరికరాలను వారు వినియోగిస్తారు. ప్రఖ్యాత గాయకులు, కళకారులు తమ సంగీత సమారోహంతో శ్రీరాముడిని అర్చనలను సమర్పిస్తారు. ఆహ్వానితులందరికీ చిన్నపాటి గంటను ఇస్తారు. హారతి సమయంలో వారంతా ఈ గంటను మోగించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications