వీడియో: అయోధ్య రామమందిరం ఇప్పుడెలా ఉందంటే..: కిటకిట

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.

ఈ మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే.

Ayodhya Ram Mandir: Heavy rush outside the Ram Temple

మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ గర్భగుడిలోనికి ప్రవేశించారు. రాములవారికి మోదీ తొలి పూజలు చేశారు. విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించి కాటుకను పూశారు.

ప్రారంభోత్సవం పూర్తయిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రాములోరిని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీనితో ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాల రాముడిని దర్శించడానికి ఇప్పటికే వేలాదిమంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.

దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్యానగరం నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు. రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. నేరుగా బాల రాముడిని దర్శించుకోవడానికి ఆలయాలనికి పోటెత్తారు.

అర్ధరాత్రి నుంచే నుంచే ఆలయం ప్రాంగణం ముందు బారులు తీర్చినిల్చున్నారు. అయిదు డిగ్రీల చలిని కూడా వారు లెక్కచేయలేదు. ఈ తెల్లవారు జామున 4 గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోనికి పరుగులు తీశారు.

కాషాయ దుస్తులు ధరించి, హనుమ ధ్వజాలను చేతపట్టుకుని, జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనలా ఆలయంలోనికి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. వారిని నియంత్రించడం అక్కడి సిబ్బంది వల్ల కాలేదు. ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కిందపడటం కనిపించింది. ఎలాంటి తొక్కసలాట చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+