అయోధ్యలో ప్రతిష్ఠించే లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారి విగ్రహాలు ఇవే
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.

ఈ నెల 15వ తేదీ నాడే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలనూ పంపించింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి.
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకొనే రామ్ లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది. శ్రీ ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రులవారి విగ్రహాలు అవి. మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వాటిని నిర్మించారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను రామమందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్..నిర్ణయించింది.
ఆ విగ్రహ ఫొటోలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తమ అధికారిక్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కన్నడిగుడు రూపొందించిన విగ్రహాలను అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయాలనుకోవడం దేశం మొత్తానికే గర్వకారణమని అభినందించారు.
కర్ణాటకకే చెందిన గణేష్ భట్, రాజస్థాన్ శిల్పి సత్యనారాయణ్ పాండే రూపొందించిన విగ్రహాలను షార్ట్ లిస్ట్ లోకి తీసుకుంది తీర్థక్షేత్ర ట్రస్ట్. చివరికి అరుణ్ యోగిరాజ్ నిర్మించిన విగ్రహాలను అయోధ్యలో ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ముంబైకి చెందిన వాసుదేవ్ కామత్ గీసిన చిత్రాల ఆధారంగా ఈ విగ్రహాలను రూపొందించారాయన.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications