Ayodhya ram mandir: జుట్టుతో శ్రీరామ రథాన్ని లాగుతూ రామభక్తిని చాటుకున్న సాధువు!!

ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీరామ మేనియా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో నిర్మించిన శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవం మరియు రామ విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయి.

550 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి వేంచేస్తున్న శుభ తరుణం కోసం హిందువులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా శ్రీరామ మందిరానికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా ఆలయాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. 2500 సంవత్సరాలు ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురైనప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేలా కేవలం శిలలతోనే రామాలయ నిర్మాణాన్ని చేశారు.

Ayodhya ram mandir: Saint devotion by pulling the chariot of lord Sri Ram with his hair!!

శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు మరి కొద్ది గంటలే సమయం ఉన్న నేపథ్యంలో అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సన్నాహక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్టకు ముందు క్రతువులు ఈనెల 19వ తేదీన ప్రారంభం కాగా విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొనే దంపతులు ఇప్పటికే శ్రీరామ ధ్యానాన్ని చేస్తూ 45 నియమాలను నిష్టగా ఆచరిస్తున్నారు.

శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు అయోధ్య గర్భాలయంలోకి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళనున్న నేపథ్యంలో ఆయన కూడా నిష్టగా ఆచారాలను పాటిస్తున్నారు.ఇదిలా ఉంటే శ్రీరామ భక్తీ తెలియజేసేలా దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రామయ్య మీద ఉన్న భక్తిని భక్తులు వినూత్నంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీర్ భద్రి అనే ఒక సాధువు శ్రీరాముడిపై తనకు ఉన్న భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నాడు.

శ్రీరాముడి రథాన్ని తన జుట్టుతో లాగుతూ 566 కిలోమీటర్ల దూరంలో ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన దామోహ్ నుండి అయోధ్య వరకు ఈ ప్రయాణాన్ని సాగించనున్నారు. జనవరి 11వ తేదీన ఈ యాత్రను ప్రారంభించిన భద్రి రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలికి చేరుకున్నారు.

శ్రీరాముడి రథాన్ని లాగుతూ అయోధ్యకు చేరుకుని అయోధ్యలో రామయ్యను దర్శించుకోవాలని, అయోధ్యలో శ్రీరామ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెబుతున్నారు సీర్ భద్రి. ఇక ఇటువంటి ఎంతోమంది రామభక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటూ రామ భజనలు చేసుకుంటూ అయోధ్యకు చేరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+