వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict: అయోధ్య తీర్పులో కీలకంగా పురావస్తు నివేదిక

|
Google Oneindia TeluguNews

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. సంచలన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో వెల్లడించిన తీర్పులో పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక కీలక భూమిక పోషించింది.

పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు

పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు

అయోధ్యలో వివాదాస్పదమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి హిందువులదే అని జడ్జిమెంట్ ఇచ్చింది . భారత పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక సుప్రీంకోర్టు తీర్పులో కీలకమైంది .అయోధ్యలో ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెబుతున్నాయని పేర్కొంది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లామ్‌ మూలాలు లేవని తెలిపింది.

అలహాబాద్ తీర్పు సమయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం

అలహాబాద్ తీర్పు సమయంలో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం

శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య అన్న హిందువుల విశ్వాసం వివాదరహితం అని పేర్కొంది. అందుకు ఆధారాలున్నాయని పేర్కొంది. గతంలో అలహాబాదు కోర్టులో తీర్పు ఇచ్చిన సమయంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొన్న వ్యాఖ్యలనే మరోసారి సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నాడు తీర్పు సమయంలో కూడా రామ జన్మ భూమి రాముడిదే అని చెప్పింది ధర్మాసనం . కాకుంటే మూడు భాగాలు చేసి హిందువులు, ముస్లిం లు పంచుకోవాలని సూచించింది.

నాడు త్రిసభ్యకమిటీ చేసిన వ్యాఖ్యలే .. నేడు సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు

నాడు త్రిసభ్యకమిటీ చేసిన వ్యాఖ్యలే .. నేడు సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు

అలహాబాద్ హైకోర్టులో అయోధ్య వివాదం పై త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను గమనిస్తే జస్టిస్ డి వి శర్మవివాదాస్పద స్థలంలో రాముడి జన్మ స్థానం అని పేర్కొన్నారు. ఇక అక్కడ బాబర్ ఇస్లామిక్ సాంప్రదాయాలకు విరుద్ధంగాఒక నిర్మాణాన్ని చేసినట్లుగా, ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలు లేవనిఆయన పేర్కొన్నారు.జస్టిస్ సుధీర్ అగర్వాల్హిందువుల విశ్వాసం ప్రకారం అది రామజన్మభూమిఅని, అక్కడ మసీదుని ఎవరు ఎప్పుడు నిర్మించారు రుజువు కాలేదని పేర్కొన్నారు.ఇకజస్టిస్ఎస్ యుఖాన్మసీదు నిర్మాణం కోసం ఏ గుడిని కూలగొట్ట లేదని చాలా కాలంగా పడి ఉన్న ఆలయ శిథిలాల మీద మసీదును నిర్మించారనిపేర్కొన్నారు.

1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువుల సందర్శించారనేందుకు అధారలున్నాయన్న సీజే

1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువుల సందర్శించారనేందుకు అధారలున్నాయన్న సీజే

ఇక తాజాగా సుప్రీం ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. రామజన్మ భూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇక్కడ రాముడే కక్షిదారుడు అంటూ పేర్కొంది. స్థలం తమ ఆధీనంలో ఉందని సున్నీ వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయిందని అలాంటి ఆధారాలు ఏమీ లేవని సుప్రీం ధర్మాసనం చెప్పింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువుల సందర్శించారనేందుకు ఆధారాలున్నాయన్నది.

తీర్పులో కీలకంగా మారిన పురావస్తు శాఖ నివేదిక

తీర్పులో కీలకంగా మారిన పురావస్తు శాఖ నివేదిక

అయితే రామ మందిరాన్ని కూల్చి మసీదును కట్టారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని కూడా పేర్కొంది. వివాదాస్పద స్థలంలో ఆలయం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) నివేదిక కూడా ఇచ్చిందని తెలియజేసింది. మొత్తానికి భారత పురావస్తు శాఖ అందించిన నివేదిక ఆధారంగా చేసుకుని సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు, షియా వక్ఫ్ బోర్డుకానీ కచ్చితంగా ఆధారాలు సమర్పించ లేకపోవడంతో వారి పిటిషన్ లను కొట్టి వేసి రామజన్మభూమి రాముడి దే అని తీర్పు ఇచ్చింది సుప్రీం ధర్మాసనం.

English summary
The Supreme Court has ruled that the controversial land of Ramzanmabhoomi and Babri Masjid case . The report of the Archaeological Survey of India is crucial to the Supreme Court's decision .The Archaeological Department reports that the Babri Masjid was not built on vacant land. Islam has no roots in the construction of the controversial site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X