వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ayodhya verdict:ముందు రామమందిరం, తర్వాతే ప్రభుత్వం, బీజేపీపై శివసేన విసుర్లు

|
Google Oneindia TeluguNews

బీజేపీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీకి మందిరాలే ముఖ్యమని మండిపడింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సోయి లేదని.. కానీ అయోధ్య వివాదం మాత్రం ముఖ్యమని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ఆలోచన లేదని ఓ రేంజ్‌లో ఫైరయ్యింది.

అయోధ్య తీర్పు వెలువడ్డాక శివసేన నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలకు ముందు మందిరం తర్వాతే ప్రభుత్వం అని పోస్ట్ చేశారు. అయోధ్యలో ఆలయం, మహారాష్ట్రలో ప్రభుత్వం, జై శ్రీ రాం అంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శివసేన మద్దతు తెలిపింది. కానీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి నెలకొనడంతో బీజేపీపై రౌత్ అక్కసు వెళ్లగక్కాడు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు బీజేపీ-శివసేన ముందుకొచ్చాయి. కానీ వారి మధ్య అధికారం పంచుకోవడంపై విభేదాలు తలెత్తాయి. సీఎం పోస్టు కావాలని సేన, కాదు కూడదని బీజేపీ అనడంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసిపోయింది. ఈ క్రమంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ayodhya verdict: First Temple, then Maharashtra government: Sanjay Raut

సీఎం పదవీకి రాజీనామా చేశాక మీడియాతో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. శివసేనకు సీఎం పోస్టు ఇస్తామని చెప్పలేదన్నారు. ఈ డిమాండ్‌ను ఉద్దవ్ థాక్రే కొత్తగా తీసుకొచ్చారని తెలిపారు. కానీ ఉద్దవ్ బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనే అధికార మార్పిడిపై చర్చలు జరిగాయని చెప్పారు. ఇదీ కొత్తగా జరిగింది కాదన్నారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

English summary
"First temple, then government. Temple in Ayodhya, the government in Maharashtra... Jai Shri Ram."Shiv Sena senior leader Sanjay Raut posted a cryptic message on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X