• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Ayodhya verdict :అయోధ్య కేసులో కీలక ఘట్టాలు...తీర్పులన్నీ సంచలనాలే

|

అయోధ్య తీర్పు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.134ఏళ్ళ సుదీర్ఘ అయోధ్య వివాదానికి నేటితో తెరపడనుంది. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సంచలన తీర్పును వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో సుదీర్ఘ కాలం చాలా సున్నితమైన అంశంగా కొనసాగిన ఈ వివాదానికి సంబంధించిన కీలక ఘటనలను మీ ముందు ఉంచుతుంది వన్ఇండియా .

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి పై హిందూ, ముస్లిం పక్షాల వివాదం

అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి పై హిందూ, ముస్లిం పక్షాల వివాదం

దశాబ్దాలుగా చాలా సున్నితమైన సమస్య గా, నేటి వరకు పరిష్కారం కాని ఈ కేసులో ఫైనల్ గా తీర్పు వెల్లడించనున్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి పై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాలుగా నెలకొన్న వివాదంలో కోర్టులు ఇచ్చిన అన్నితీర్పులూ సంచలనాలే. ఇక అయోధ్య వివాదంలో న్యాయస్థానంలో దాఖలైన కేసుల్లో కొన్ని కీలకమైన కేసుల ప్రస్తావన ఇది .

1885లో ప్రారంభమైన వ్యాజ్యాలు

1885లో ప్రారంభమైన వ్యాజ్యాలు

1885లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ ఛబుత్ర ప్రాంతంలో రామమందిరం నిర్మాణానికి అనుమతి కోరుతూ ఫైజాబాద్ జిల్లా కోర్టులో మహంతి రఘువరదాసు అనే వ్యక్తి వ్యాజ్యం దాఖలు చేశారు. ఇక ఈయన వేసిన వ్యాజ్యానికి ప్రతిగా మసీదు ముతావలి సైతం మరో కేసు దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ వ్యాజ్యాలను కొట్టేసింది. 1949 డిసెంబర్ నెలలో బాబ్రీ మసీదులో సీతారామ విగ్రహాలను ప్రతిష్ఠించారు.దీంతో ముస్లిం పక్షాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ మత ఘర్షణలు తలెత్తే పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంగణాన్ని సీజ్ చేయించి, తాళాలు వేయించింది.

1986లో ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి సంచలన ఆదేశాలు

1986లో ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి సంచలన ఆదేశాలు

ఇక ఆ తర్వాత 1950 జనవరిలో సీతారామ విగ్రహాలకు పూజలు చేయడానికి అవకాశం కల్పించాలంటూ గోపాల్ సింగ్ విశారద, రామచంద్ర దాస్ పరమహంస ఫైజాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత 1961 ఫిబ్రవరి నెలలో బాబ్రీ మసీదు తమ సొత్తు అని, దీనిపై హిందువులు వేసిన పిటిషన్ కొట్టివేయాలని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కోర్టును ఆశ్రయించింది. 1986 ఫిబ్రవరి నెలలో బాబ్రీ మసీదును తెరచి, హిందువులు పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో అదే ఏడాది బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. వివాదం కాస్త తీవ్రమైంది.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ... విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ... విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్

ఇక దీంతో 1989లో బాబ్రీ మసీదు రామజన్మభూమి కి సంబంధించిన కేసులను ఉత్తర ప్రదేశ్ హైకోర్టుకు బదలాయించారు. ఇక 1992 డిసెంబర్ 6వ తేదీన ఊహించని విధంగా కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. దీంతో మతవిద్వేషాలు రగులుతున్న నేపధ్యంలో 1992 డిసెంబర్ 12న ఈ ఘటనపై విచారణ చేయాలని జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ను నియమించడం జరిగింది. ఇక 1993లో విచారణ ప్రారంభించింది జస్టిస్ లిబర్హాన్ కమిషన్ . ఇక కమిషన్ విచారణతో పాటు, సిబిఐ సైతం పలు కీలక ఆధారాలను సేకరించింది. మసీదు కూల్చివేతకు కరసేవకులను రెచ్చగొట్టింది బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ మరియు 19 మంది నాయకులని గుర్తించి అయోధ్య రథయాత్ర నిర్వహించిన వీరిపై కేసులు నమోదు చేసింది.

బీజేపీ నాయకులపై కేసులు .. 2003లో మసీదు కింద ఆలయం ఉందన్న భారత పురాతత్వ పరిశోధన సంస్థ

బీజేపీ నాయకులపై కేసులు .. 2003లో మసీదు కింద ఆలయం ఉందన్న భారత పురాతత్వ పరిశోధన సంస్థ

అంతేకాదు అలహాబాద్ హైకోర్టులో ఈ వ్యవహారంలో పలు కేసులు సైతం దాఖలు చేశారు. 2001 మే నెలలో నేరపూరిత కుట్ర అభియోగాల నుండి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లకు ఊరట లభించింది. ప్రత్యేక న్యాయస్థానం వీరికి ఉపశమనం కలిగించింది. ఇక 2002 ఏప్రిల్ నెలలో అయోధ్య స్థల వివాదంపై అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. తరువాత 2003లో భారత పురాతత్వ పరిశోధన సంస్థ మసీదు కింద ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాలను బయటపెట్టింది. అయితే ఈ ఆధారాల పై విభేదించిన ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

2009 జూన్లో లిబర్హాన్ కమిషన్ నివేదిక..2010లో అలహాబాద్ కోర్టు చారిత్రాత్మక తీర్పు

2009 జూన్లో లిబర్హాన్ కమిషన్ నివేదిక..2010లో అలహాబాద్ కోర్టు చారిత్రాత్మక తీర్పు

ఇక అయోధ్య లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై, కూల్చివేత ఘటనకు బాధ్యుడిగా 68 మంది ని గుర్తించి 2009 జూన్లో లిబర్హాన్ కమిషన్ నివేదిక సమర్పించింది. 2010 సెప్టెంబర్ 30న వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి రెండు భాగాలు హిందువులకు ఒక భాగాన్ని ముస్లింలకు పంచాలని అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఇక దీనిని సవాలు చేస్తూ ఆ తర్వాత సుప్రీం కోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

సుప్రీం కు చేరిన కేసు .. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిలుపుదల

సుప్రీం కు చేరిన కేసు .. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిలుపుదల

ఆ తర్వాత 2011 మే నెలలో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. ఇక వివాదాస్పద స్థలంపై స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఫిబ్రవరి నెలలో స్థల యాజమాన్య విషయంలో అత్యవసర విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టును బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ఆశ్రయించారు. మార్చి 21 2017 న ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని, న్యాయస్థానం బయట చేసుకోవాలని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. అంతేకాదు దీనికి మధ్యవర్తిత్వం వహించడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.

2017 లో తిరిగి కేసులో విచారణ ప్రారంభించాలని సుప్రీం నిర్ణయం

2017 లో తిరిగి కేసులో విచారణ ప్రారంభించాలని సుప్రీం నిర్ణయం

2017 ఏప్రిల్ 19న 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులపై నమోదైన కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలని సిబిఐ న్యాయస్థానానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రోజువారీ విచారణ ప్రారంభించాలని 2019 నాటికి కేసు కొలిక్కి తీసుకురావాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2017 మే 26న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బిజెపి నేతలు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఉమాభారతి, విష్ణు హరి దాల్మియా, సాధ్వీ రితంభరలకు అభియోగాల నమోదు నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అదనపు అభియోగాలను సైతం నమోదు చేసింది. 2017 డిసెంబరు 5న ఈ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది.

2019 లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం

2019 లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం

2019 ఆగస్టు 1వ తేదీన అయోధ్య స్థల వివాదం కేసులో వాదనలు వినడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటయింది. ఇక దీనిలో సభ్యులుగా జస్టిస్ ఎస్ ఏ బొబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ డి వై చంద్ర చూడ్ ఉన్నారు. అయితే ఆ తర్వాత 2019 జనవరి 25వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం పునర్వ్యవస్థీ కృతమైంది. ఈసారి బెంచ్ లో జస్టిస్ రంజన్ గొగోయ్ తో పాటు, జస్టిస్ ఎస్ ఏ బొబ్డే, జస్టిస్ డి వై చంద్ర చూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఉన్నారు.

మధ్యవర్తిత్వం కోసం త్రిసభ్యకమిటీ

మధ్యవర్తిత్వం కోసం త్రిసభ్యకమిటీ

2019 మార్చి 8వ తేదీన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ ఎమ్ ఐ ఖలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 2019 మే 10వ తేదీన మధ్యవర్తిత్వం చేసిన త్రిసభ్య కమిటీ తుది నివేదికను సమర్పించింది. వారికి సయోధ్య కుదర్చడం లో ఫెయిల్ అయింది.

నలభై రోజుల పాటు సాగిన విచారణ .. నేడు తీర్పు

నలభై రోజుల పాటు సాగిన విచారణ .. నేడు తీర్పు

ఆ తర్వాత 2019 ఆగస్టు 6 నుండి రోజువారీ ప్రాతిపదికన విచారణ ప్రారంభమై 40 రోజులపాటు కొనసాగింది. 2019 అక్టోబర్ 16న న్యాయస్థానం లో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ అయింది. 2019 నవంబర్ 11న అంటే నేడు మరోమారు అయోధ్య వివాదాస్పద భూములపై తుది తీర్పు వెల్లడి కానుంది. నాటి నుండి నేటి వరకు అనేక కీలక పరిణామాలతో, ఊహించని తీర్పులతో అయోధ్య కేసు సుదీర్ఘంగా కొనసాగింది. నేటితో ఈ కేసు ప్రస్థానానికి తెరపడనుంది.

English summary
The 134-year-old Ayodhya dispute is set to open today. A five-member bench headed by Chief Justice of India Ranjan Gogoi is expected to deliver a sensational verdict on 10.30 AM today. Oneindia puts the key events of this controversy that have long been a sensitive issue in this context.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X