వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది కేంద్రం ఘనత కాదు : మందిర నిర్మాణచట్టానికి నిరాకరించారు: శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు మీద శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే ఆక్షేపించారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న సేన ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించింది. దీంతో...ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేసారు. ఇక, రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర వెళ్తోంది. ఇదే సమయంలో అయోధ్య తీర్పు పైన ఉద్దవ్ స్పందన ఆసక్తి కరంగా మారింది.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..

కేంద్రం ఘనతగా చాటుకోలేదు..

కేంద్రం ఘనతగా చాటుకోలేదు..

అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మందిర నిర్మాణానికి ఏర్పాటు చేసే ట్రస్ట్‌కు అప్పగించాలని,..మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. దీని పైన స్పందించిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అయోధ్య అంశంలో తాము గతంలో చేసిన ప్రతిపాదనలను గుర్తు చేసారు.

సుప్రీం తాజా తీర్పును

సుప్రీం తాజా తీర్పును

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే ఆక్షేపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన సమయం నుండి బీజేపీతో వచ్చిన రాజకీయ విబేధాల కారణంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. ఠాక్రే తీర్పు విషయంలో సైతం కేంద్రం పైనే గురి పెడుతూ వ్యాఖ్యలు చేసారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనేనా..

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనేనా..

ఇక, ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసారు. ఎన్నికల ముందు కలిసి పోటీ చేసిన బీజేపీ..శివసేన మధ్య అధికారం పంచుకోవటంలో వచ్చిన విభేదాల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని..అధికారం రెండున్నారేళ్ల పాటు పంచుకోవాలనే శివసేన డిమాండ్ కు బీజేపీ ససేమిరా అంది.

గవర్నర్ ను ఫడ్నవీస్ కలిసారు

గవర్నర్ ను ఫడ్నవీస్ కలిసారు

అదే సమయంలో ఎన్సీపీ..కాంగ్రెస్ తో శివసేన మంతనాలు జరపటాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించింది .దీంతో..వారి డిమాండ్లకు తలొగ్గరాదని నిర్ణయించింది. అందులో భాగంగా.. రాజీనామా చేస్తూ గవర్నర్ ను ఫడ్నవీస్ కలిసారు. దీంతో...ఇక ఇప్పుడు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్ సిఫార్సు చేసే అవకాశాలు ెక్కువగా కనిపిస్తున్నాయి.

English summary
Ayodhya Verdict: Shivasena Chief uddhav thackeray responded on Supreme court Verdict on Ayodhya dispute, thackeray says Central govt should not credit this verdict in thier political account .Thakrey says that previously they demanded for act on Ramalayam construction in Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X