పందులు కూడా పిల్లలను కంటాయి: ఆజంపై ఆదిత్యనాథ్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌పై బిజెపి ఫైర్‌బ్రాండ్ పార్లమెంటు సభ్యుడు యోగీ ఆదిత్యానాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఖాన్‌ను పాకిస్తాన్‌కు పంపించాలని ఆయన అన్నారు. తనకు కుటుంబం లేకపోవడంతో తనకు ఆ బాధ తెలియదని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై ఆజంఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది.
తనకు భార్యా ఇద్దరు పిల్లులు ఉన్నారని, అది లేని రాజు మనకు ఉన్నారని, ఎవరి బాధనైనా ఆయనకు ఎలా అర్థమవుతుందని ఆజంఖాన్ మోడీని ఉద్దేశించి అన్నారు. ఆజంఖాన్ ఓ కాకి అని, చెట్టు మీద కూర్చుంటే ఆ చెట్టు కొమ్మకు రోగం వస్తుందని ఆదిత్యానాథ్ అన్నారు.

"ఆయనను పాకిస్తాన్‌కు పంపించేయాలి. పందులు కూడా పిల్లలను కంటాయి. పందులు ఎలా పిల్లలను పెడతాయో ఆజం ఖాన్ వివరించాలి" అని ఆయన అన్నారు. ఆజంఖాన్, ఆదిత్యానాథ్ గతంలో కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి.
జమా మసీద్ సాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీను పాకిస్తాన్‌కు పంపించేయాలని ఇంతకు ముందు ఆదిత్యానాథ్ అన్నారు. తాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌నైనా ఆహ్వానిస్తాను గానీ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించబోనని బుఖారీ అనడంపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. ఆజంఖాన్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి.












Click it and Unblock the Notifications