చిక్కుల్లో అజంఖాన్: రేపిస్టు సైనికుల మర్మాంగాలు తెగ్గోయమన్నందుకు ఫిర్యాదులు..
రేపిస్టు సైనికులపై తిరగబడాలని, అవసరమూతే వారి మర్మాంగాలు కోసి పారేయాలని అజంఖాన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
లక్నో: సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎస్పీ నేత అజంఖాన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాంపూర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. అజంఖాన్ వ్యాఖ్యలు సైనికుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
కాగా, రేపిస్టు సైనికులపై తిరగబడాలని, అవసరమూతే వారి మర్మాంగాలు కోసి పారేయాలని అజంఖాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కశ్మీర్, జార్ఱండ్,అసోంలలో సైన్యం ఆగడాలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి గుప్తవయవాలను ఖండించి, మహిళలు వారికి బుద్ది చెప్పాలని అన్నారు.

దీనిపై వివరణ ఇచ్చిన అజంఖాన్.. తాను సైన్యాన్ని కించపరలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications