రూ. 700 కోట్లు జోగ్ ఫాల్స్ లో పెడుతున్న వ్యాపారి
శివమొగ్గ: ప్రపంచ ప్రసిద్ది చెందిన జోగ్ జలపాతం (జోగ్ ఫాల్స్) అభివృద్దికి దుబాయిలోని వ్యాపారవేత్త రూ. 700 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని జోగ్ ఫాల్స్ అభివృద్దిపై కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
బెంగళూరు నగరంలో అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో 38వ పసిఫిక్ ఏషియా ట్రావెల్స్ మార్ట్ -2015 ఏర్పాటు చేశారు. ఈ సందర్బంలో వివిధ పర్యాటక కేంద్రాలను అభివృద్ది చెయ్యడానికి వ్యాపారవేత్తలతో కర్ణాటక పర్యాటక శాఖ కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది.
శివమొగ్గ జిల్లాలోని జోగ్ ఫాల్స్, మైసూరులోని చాముండి కొండ, కబిని, కోడగు, బెంగళూరులోని హలసూరు చెరువులో హోటల్ నిర్మాణం తదితర అభివృద్ది పథకాలపై కర్ణాటక ప్రభుత్వంతో వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆర్.వీ. దేశ్ పాండే సమక్షంలో అధికారులు, వ్యాపారవేత్తలు అధికారికంగా పత్రాలపై సంతకాలు చేశారు.
కర్ణాటకకు చెందిన బీ.ఆర్. శెట్టి అనే ఆయన దుబాయిలో వ్యాపారం చేస్తున్నారు. జోగ్ ఫాల్స్ అభివృద్దికి రూ. 700 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఈయన సిద్దం అయ్యారు. జోగ్ ఫాల్స్ దగ్గర మిని ఎయిర్ పోర్టు, హెలిప్యాడ్, సెవన్ స్టార్ కాటేజ్ నిర్మించడానికి సిద్దం అయ్యారు.
సంవత్సరం మొత్తం జోగ్ ఫాల్స్ లో నీరు ప్రవహించడానికి ప్లాన్ చేస్తున్నారు. జోగ్ చుట్టు పక్కల 10 కిలో మీటర్లు సుందరమైన రహదారులు నిర్మించాలని, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఎర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. ఐదు సంవత్సరాలలో జోగ్ ఫాల్స్ అభివృద్ది చేస్తామని బీ.ఆర్. శెట్టి అంటున్నారు.
జోగ్ ఫాల్స్ లో నిత్యం వివిద బాషల సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందితే పర్యాటక శాఖకు మంచి లాభాలు వస్తాయని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications