వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు బీఏ,బీకాం,బీఎస్సీ విద్యార్థులా... ఇక మీకూ ఆ ఛాన్స్... యూజీసీ కొత్త గైడ్ లైన్స్...

|
Google Oneindia TeluguNews

ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేసేందుకు యూజీసీ సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్,మేనేజ్‌మెంట్ విద్యార్థుల తరహాలో బీఏ,బీఎస్సీ,బీకాం విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్స్‌ పొందే అవకాశం కల్పించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) డిగ్రీ కోర్సులకు సంబంధించి అప్రెంటిస్‌షిప్/ఇంటర్న్‌షిప్ మార్గదర్శకాలను శుక్రవారం(అగస్టు 7) విడుదల చేసింది.

ఇంటర్న్‌షిప్ కోసం ఒక పూర్తి సెమిస్టర్...

ఇంటర్న్‌షిప్ కోసం ఒక పూర్తి సెమిస్టర్...

ప్రొఫెషనల్ కోర్సులైన జర్నలిజం,ఇంజనీరింగ్,మేనేజ్‌మెంట్ తదితర కోర్సులు చేస్తున్నవారికే ప్రస్తుతం ఇంటర్న్‌షిప్స్‌కు అవకాశం ఉంది. బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లోనూ ఇంటర్న్‌షిప్స్‌ని చేర్చితే.. కోర్సు తర్వాత విద్యార్థులు ఉద్యోగానికి అవసరమయ్యే అవగాహనను,అనుభవాన్ని కలిగి ఉంటారని యూజీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఏ,బీకాం,బీఎస్సీ విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్స్ కల్పించేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం కాలేజీలు,యూనివర్సిటీలు.. కోర్సులో ఒక పూర్తి సెమిస్టర్‌ను ఇంటర్న్‌షిప్‌ కోసం కేటాయించాలి.

ఎన్ఈపీలో భాగంగా...

ఎన్ఈపీలో భాగంగా...

కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం(NEP)లో భాగంగానే డిగ్రీ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్న్‌షిప్స్‌లో విద్యార్థుల ప్రతిభకు మొత్తం కోర్సు క్రెడిట్స్‌లో 20శాతాన్ని కేటాయించాలని యూజీసీ కమిషన్ యూనివర్సిటీలకు సూచించింది. భారత్‌లో ప్రతీ ఏటా భారీ సంఖ్యలో విద్యార్థులు జనరల్ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే కోర్సులు పూర్తి చేసినప్పటికీ వీరికి బయట ఉద్యోగావకాశాలు అంతగా ఉండట్లేదు. కాబట్టి విద్యార్థులను కేవలం అకడమిక్‌కే పరిమితం చేయకుండా... ఇంటర్న్‌షిప్స్ కూడా అందజేస్తే మార్కెట్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారన్న వాదన చాలాకాలంగా ఉంది. ఇందుకు అనుగుణంగానే యూజీసీ తాజా మార్గదర్శకాలు కనిపిస్తున్నాయి.

ఇంటర్న్‌షిప్‌కు క్రెడిట్స్...

ఇంటర్న్‌షిప్‌కు క్రెడిట్స్...

తాజా మార్గదర్శకాల ప్రకారం... ఏ డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థులైనా సరే ఇంటర్న్‌షిప్/అప్రెంటిషిప్‌కి అర్హులే. అయితే ఇంటర్న్‌షిప్ అనేది క్యాంపస్‌లో అందించే ప్రోగ్రామ్ కాదు. కమర్షియల్ లేదా నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్‌లో విద్యార్థులకు ఇచ్చే ప్రాక్టికల్ ట్రైనింగే ఇంటర్న్‌షిప్. విద్యార్థులు తమంతట తామే తమకు నచ్చిన ఫీల్డ్‌లో ఇంటర్న్‌షిప్‌లో చేరే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పీరియడ్‌లో విద్యార్థి పనితనం ఆధారంగా ఇనిస్టిట్యూషన్ అతనికి క్రెడిట్స్ ఇస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో రాణించినవారికి.. ఆ తర్వాత ఉద్యోగ,ఉపాధి అవకాశాలు సులువుగా దక్కించుకోవచ్చు.

English summary
Students pursuing regular degree courses such as BA, BCom, BSc, among others, will now be able to undertake internships as part of their course, just like their counterparts in professional courses like engineering and management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X