బాబా సిద్దిఖీ హత్య కేసు: నేపాల్ బోర్డర్‌లో షూటర్ శివ అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీ సీనియర్ నేత బాబా సిద్దిఖీ (Baba Siddique) హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిఖీపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షూటర్ శివకుమార్ తోపాటు మరో నలుగురిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు యూపీ మీదుగా నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సిద్దిఖీ హత్య కేసులో ఇప్పటికే దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు షూటర్లలో శివ ఒకరు. ఘటన అనంతరం ఇతడు పరారయ్యాడు. ఈ క్రమంలోనే యూపీ ఎస్టీఎఫ్‌తో కలిసి ముంబై పోలీసులు ఆదివారం శివ తోపాటు అతడికి ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో తనకు సంబంధం ఉందని విచారణలో అతడు అంగీకరించాడని, అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకే ఈ హత్య చేసినట్లు చెప్పాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే అన్మోల్. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘట సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్.. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు ముంబై పోలీసులకు ఇటీవలే సమాచారం అందింది. అతడి కదలికలకు సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు.. పోలీసులతో పంచుకున్నారు. దీంతో అతడ్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
కాగా, అక్టోబర్ 12న బాబా సిద్దిఖీ ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు మృతి చెందారు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ లారెన్స్ బిష్ణోయ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications