ఏప్రిల్‌లోనే 40 డిగ్రీలు.. ముంచుకొస్తున్న ముప్పు! జోస్యం నిజమవుతోందా!
బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధురాలు, భవిష్యవాణి చెప్పడంలో దిట్ట అయిన బాబా వంగా చేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఆమె గతంలో చెప్పిన 9/11 దాడులు, సునామీ వంటి ఘటనలు నిజం కావడంతో ఆమె మాటలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె చేసిన ఓ అంచనా ఇప్పుడు భారత్‌తో సహా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. రాబోయే కాలంలో ప్రకృతి ప్రకోపం ఏ స్థాయిలో ఉండబోతుందో బాబా వంగా తన జోస్యంలో వివరించారు.
ప్రచండమైన ఎండలు ఉక్కిరిబిక్కరి చేసే ఉక్కపోత
బాబా వంగా అంచనా ప్రకారం.. 2026లో ఎండలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయి. వడగాల్పులు, సూర్యుని ప్రచండమైన వేడి ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తాయి. ఎంతలా అంటే.. మనం ఇంట్లో వాడుకునే ఏసీలు, కూలర్లు కూడా ఆ వేడి నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనాన్ని కలిగించలేవని బాబా వంగా పేర్కొన్నారు. విపరీతమైన దాహం, గొంతు ఎండిపోయే పరిస్థితులు ఎదురవుతాయని.. కేవలం నీడలో ఉన్నా సరే వేడి సెగలు తగిలి ప్రజలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

నిజమవుతున్న అంచనాలు?
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే బాబా వంగా మాటలు నిజమవుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఏప్రిల్ నెలలోనే ఢిల్లీతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. రాబోయే రోజుల్లో 'హీట్ వేవ్' పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఉష్ణోగ్రత పెరిగి, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని ఆమె ఏళ్ల క్రితమే అంచనా వేశారు. భానుడి ప్రతాపం వల్ల పగటిపూట కర్ఫ్యూ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నీటి ఎద్దడి, రుతుపవనాల ప్రభావం
కేవలం ఎండలే కాకుండా 2026లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని బాబా వంగా జోస్యం చెప్పారు. రుతుపవనాల ప్రభావం తగ్గి వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయని, దీనివల్ల జల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆమె వివరించారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, నదులు ఎండిపోవడం వంటి పరిణామాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంటార్కిటికాలోని భారీ గ్లేసియర్లు వేగంగా కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి వాతావరణంలో అనిశ్చితికి దారితీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.
గ్లోబల్ వార్మింగ్‌పై శాస్త్రవేత్తల ఆందోళన
గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయకపోతే ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా.. అది ఆహార గొలుసుపై కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బాబా వంగా అంచనాలు మనకు ఓ హెచ్చరిక లాంటివని, వాటిని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. అడవుల నరికివేతను ఆపి, కాలుష్యాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో ఈ వడగాల్పులు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026 సంవత్సరం మానవాళికి ఓ పెద్ద పరీక్షగా నిలవనుందని ఈ భవిష్యవాణి సారాంశం.












Click it and Unblock the Notifications