ఈ సారి మరింత భయంకరంగా కరోనా..? బాబా వంగా సంచలన జోస్యం..?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. వారం క్రితం వరకూ దేశంలో అదుపులోనే ఉన్న మహమ్మారి.. గత రెండు రోజులుగా కేసులు పెరుగుదల కనిపించడం ఆందోళనకరంగా మారింది. మే 26 నాటికి దేశంలో కొవిడ్ కేసులు వేయి మార్కును దాటేశాయి. కేరళ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో తాజాగా 430 మందికి పైగా కొవిడ్ సోకింది. ఆ తరువాత తమిళనాడులో 69, కర్ణాటకలో 47, గుజరాత్‌లో 83, రాజస్థాన్‌లో 13,బెంగాల్‌లో 12.. కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక ప్రస్తుతం దేశంలో ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 అనే రెండు కొత్త కొవిడ్ సబ్ వేరియంట్లను వైద్యులు గుర్తించారు. చైనాతో పాటు ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి ఈ సబ్ వేరియంట్లు కారణం అని ఐసీఎంఆర్ ఇటీవల పేర్కొంది. ఈ సబ్ వేరియంట్ల వల్ల దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషణ చేస్తున్నామని పేర్కొంది.

భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగా జోస్యంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. 2030లో ఓ కొత్త వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుందని బాబా వంగా అంచనా వేశారు. కానీ ఈ కొవిడ్ వైరస్ అంతకు ముందే వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కరంగా ఉంది.

Baba Vanga s 2025 Prophecy Did She Predict the Return of Corona

అయితే బాబా వంగా గతంలోనూ చెప్పిన అనేక అంచనాలు నిజం అయ్యాయి. ఆమె గతంలో సునామీ అని హెచ్చరించారు. 2025 జూలై నెలలో జపాన్, ఫిలిప్పీన్స్‌ లను పెను సునామీ తాకుతుందని అంచనా వేశారు. 2011లో ఏర్పడిన విపత్తు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని బాబా వంగా అంచనా వేశారు. అంతేకాక జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు.. భూకంపం, సునామీ ప్రభావంతో అల్లకల్లోలం అవుతాయని అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+