వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారు ధ్వంసం..

|
Google Oneindia TeluguNews

అసన్‌సోల్ : నాల్గో విడత పోలింగ్‌లోనూ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అసన్‌సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తృణమూల్ కార్యకర్తలు కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు భద్రతా దళాలపై దాడికి దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

ఇదిలా ఉంటే అసన్‌సోల్ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై టీఎంసీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు కారు అద్దాలు పగలగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాబు సుప్రియోను అక్కడి నుంచి తరలించారు.

Babul Supriyos Car Vandalised at Asansol polling station
English summary
Clashes broke out early in Bengal's Asansol as voting was held in the fourth round of the national election. The vehicle of Union Minister Babul Supriyo, the BJP candidate in Asansol, was vandalized outside a polling station, when a fight erupted between workers of the BJP and the state's ruling Trinamool Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X