Baby: ఇంజనీరుకు కవల పిల్లలు, అమ్మమ్మ చేతిలో మూడు నెలల చిన్నారి ?, కొడుకు, తెలిసి కాపాల !
చెన్నై/ కోయంబత్తూరు: ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడికి రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. మూడు నెలల క్రితం భార్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. కూతురు, కొడుకు ఒకేసారి పుట్టడంతో దంపతులతో పాటు అందరూ మురిసిపోయారు. వేరే ఊరిలో ఉంటున్న అమ్మమ్మ పిల్లలను చూసుకోవడానికి వచ్చింది. రాత్రి పిల్లలకు మందులు తీసుకురావడానికి కన్నతల్లి సమీపంలోని మెడికల్ షాపు దగ్గరకు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో మంచం మీద కూతురు రక్తపు గాయాలతో పడి ఉన్న విషయం చూసిన తల్లి ఆందోళన చెందింది. కొడుకు కోసం వెతకడంతో బాత్ రూమ్ లో మూడు నెలల బాబును ముక్కలు ముక్కలుగా నిరికి హత్య చేసి ఓ బట్టలో చుట్టిపెట్టిన విషయం గుర్తించిన కన్న తల్లి కుప్పకూలిపోయింది. బాలుడు హత్యకు గురికావడం, చిన్నారికి తీవ్రగాయాలు కావడం కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు ఇదే సమయంలో కవల పిల్లల కన్నతల్లి అమ్మ ఇంటి నుంచి పారిపోవడం కలకలం రేపింది.

ఇంజనీరు ఫ్యామిలీ
తమిళనాడులోని కోయంబత్తూరులో భాస్కరన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇంజనీరుగా పని చేస్తున్న భాస్కరన్ కు రెండు సంవత్సరాల క్రితం మదురైకి చెందిన ఐశ్వర్యతో వివాహం అయ్యింది. భాస్కరన్, ఐశ్వర్య దంపతులు కోయంబత్తూరులోని చేరన్ నగర్ లోని నాగప్ప కాలనీలో నివాసం ఉంటూ చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

మూడు నెలల క్రితం కవలపిల్లలు
ఐశ్వర్య గర్బవతి కావడంతో ఆమెను భర్త భాస్కరన్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. మూడు నెలల క్రితం ఐశ్వర్య పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. కూతురు, కొడుకు ఒకేసారి పుట్టడంతో దంపతులతో పాటు అందరూ మురిసిపోయారు. ఇటీవల కూతురి పేరు అరికశ్రీ, కొడుకు పేరు ఆర్యన్ అని నామకరణం చేశారు.

మదురై నుంచి వచ్చిన అమ్మమ్మ
ఐశ్వర్య ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకోవడం కష్టం కావడంతో మదురైలో ఉంటున్న ఆమె తల్లి లతా కోయంబత్తూరు వచ్చింది. గత రెండు నెలల నుంచి లతా కోయంబత్తూరులోని కూతురు ఐశ్వర్య ఇంటిలోనే ఉంటున్నది. కూతురు, కొడుకును ఏమారకుండా ఐశ్వర్య కంటికి రెప్పలా చూసుకుంటున్నది. భాస్కరన్ ఆఫీసుకు వెళ్లి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు.

మెడికల్ షాపుకు వెళ్లి వచ్చి చూడగా ?
గురువారం రాత్రి ఐశ్వర్య పిల్లలకు మందులు తీసుకురావడానికి సమీపంలోని మెడికల్ షాపు దగ్గరకు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో భాస్కరన్ పని మీద బయటకు వెళ్లాడు. ఇంటిలో పిల్లల దగ్గర ఐశ్వర్య తల్లి లతా ఉంది. మందులు తీసుకుని ఇంటికి వచ్చిన సమయంలో ఆమె తల్లి లతా ఆందోళనగా ఎదురు వచ్చింది. ఏమి జరిగింది, ఎందుకు ఆందోళనగా ఉన్నావని ఐశ్వర్య ఆమె తల్లిని ప్రశ్నించింది. ఎవరో ఇంట్లో దూరి పిల్లల మీద దాడి చేశారని, అబ్బాయినిఎత్తుకుని వెళ్లిపోయారని లతా ఆమె కూతురికి చెప్పింది.

బాత్ రూమ్ లో శవమైన మూడు నెలల చిన్నారి
ఐశ్వర్య ఆందోళనతో బెడ్ రూమ్ లోకి వెళ్లి మంచం మీద చూడగా కూతురికి తీవ్రగాయాలై రక్తపుపడుగులో పడి ఉన్న విషయం చూసి ఆందోళన చెందింది. వెంటనే కొడుకు కోసం ఇళ్లు మొత్తం వెతికింది. కొడుకు కోసం వెతకడంతో బాత్ రూమ్ లో మూడు నెలల బాబును ముక్కలు ముక్కలుగా నిరికి హత్య చేసి ఓ బట్టలో చుట్టిపెట్టిన విషయం గుర్తించిన కన్న తల్లి ఐశ్వర్య కుప్పకూలిపోయింది.

హంతకురాలు అమ్మమ్మ పరార్
తరువాత కోలుకున్న ఐశ్వర్య వెంటనే భర్త భాస్కరన్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న కోయంబత్తూరులోని దుడయలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. బాబును ఆమె అమ్మమ్మ లతా హత్య చేసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. గత 15 సంవత్సరాల నుంచి లతా మానసిక అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నదని పోలీసులు అంటున్నారు. మానసిక అస్వస్థతకు గురైన మహిళను నమ్మి కవల పిల్లలను ఎందుకు కాపలా పెట్టారు ? అనే విషయం అంతు చిక్కడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. లతా కోసం తమిళనాడు మొత్తం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications