హర్యానాలో ఘోర బస్సు ప్రమాదం..9 మంది సజీవదహనం!
హర్యానాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సులో ఉన్నంటుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ బస్సులోనే 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 24 మంది తీవ్ర గాయలపాలయ్యారు. రాష్ట్రంలోని కుండలలీ మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి ఓ టూరిస్ట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 60 మంది ప్రయాణికులకు తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ టూరిస్ట్ బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్ టూర్ కు వెళ్లి సొంతరాష్ట్రమైన పంజాబ్‌కు తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ టూరిస్ట్ బస్సులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ఘోర ప్రమాదంలో 9మంది సజీవ దహనం కాగా, మరో 24మంది తీవ్రగాయాలపాలయినట్లు తెలుస్తోంది. బస్సు వెనుక నుంచి పొగ వచ్చి నెమ్మదిగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ విషయం బస్సులో ఉన్నవారికి చాలా ఆలస్యంగా తెలిసింది. బైక్‌పై ప్రయాణించే ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించి బస్సు డ్రైవర్‌కు చెప్పాడు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే చాలామంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడినవారిని నుహ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తీర్థయాత్ర ముగించుకుని వస్తుండగా ప్రమాదం..
పోలీసులు ఇచ్చిన పూర్తి సమాచారం మేరకు..పంజాబ్ చండీగఢ్‌కు చెందిన 60మంది ప్రయాణికులకు తీర్థయాత్రలకోసం మధుర, బృందావన్‌ను సందర్శించేందుకు ఓ టూరిస్ట్ బస్సులో బయలుదేరారు. అయితే, తమ సందర్శనను ముగించుకుని పంజాబ్‌కు తిరిగి వస్తున్న క్రమంలో నుహ్ జిల్లా తావడు పట్టణ సమీపంలోని కుండలీ మానేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది ఆ మంటల్లో కాలి బూడిదవ్వగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించామని, అయితే ఇంకా మృతులను గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications