గోబ్యాక్ స్లోగన్స్: రేణుకా చౌదరికి చేదు అనుభవం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరికి చేదు అనుభవనం ఎదురైంది. భద్రాచలం డివిజన్, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపకూడదంటూ ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి జెఎసి కార్యకర్తలు శనివారం ఉదయం ధర్నాకు దిగారు.
వారికి మద్దతు తెలిపేందుకు రేణుకా చౌదరి అక్కడి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. రేణుకాచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తర్వాత ఇరువురు శాంతిచడంతో రేణుకాచౌదరి ధర్నాలో బైఠాయించారు. భద్రాచలం డివిజన్ తెలంగాణదే అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదులుకోబోమని రేణుకాచౌదరి తెలిపారు.
ఖమ్మం జిల్లాలో భద్రచలానికి ప్రత్యేక స్థానం ఉందని, భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవడం తమ లక్ష్యమని రేణుకా చౌదరి చెప్పారు. రామాలయం ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications