అక్కాచెల్లెళ్లపై రేప్, ఉరి: మీడియాపై ములాయం గుర్రు
లక్నో: రాష్ట్రాన్ని వ్యతిరేక కోణంలో చూపిస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తన కుమారుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించి 24 గంటలు కూడా గడవకముందే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కూడా గుర్రుమన్నారు. జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర అంశాలపై దృష్టి సారించాలని ములాయం సింగ్ సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని వ్యాఖ్యానించారు. బాదౌన్ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి వారి శవాలను చెట్టుకు వేలాడదీసిన సంఘటనపై స్పందిస్తూ అటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని గూగుల్ సెర్చ్ చూస్తే తెలుస్తుందని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

అత్యాచార సంఘటనలు యుపిలో మాత్రమే జరుగుతున్నాయన్నంటుగా మీడియా చూపిస్తోందని ఆయన నిందించారు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు విపరీతంగా ప్రచారం చేస్తున్నారని, అటువంటి సంఘటనలు యుపిలో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల లెక్కలు తాను ఇచ్చినా మీడియా తనను అదే ప్రశ్న అడుగుతుందని ఆయన అన్నారు.
బాదౌన్ సంఘటనను చూపించిన రీతిలోనే జాతీయ మీడియా బెంగళూర్‌లో జరిగిన అటువంటి సంఘటనను చూపిస్తుందా అని అఖిలేష్ యాదవ్ అడిగారు.












Click it and Unblock the Notifications