ఆ స్కూల్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయ్: పిల్లలను పంపని పేరెంట్స్: భయాందోళనలు
భువనేశ్వర్: దేశం మొత్తాన్నీ విషాదంలో ముంచిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం. 288 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుందీ దుర్ఘటన. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సరిగ్గా వారం రోజుల కిందట పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.
గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా చెల్లాచెదురుగా పడిన కోరమాండల్ బోగీలను ఢీ కొట్టింది. దీనితో ప్రమాద తీవ్రత రెట్టింపయింది. ఈ రెండు రైళ్ల బోగీల నుంచి వెలికి తీసిన మృతదేహాలన్నింటినీ సహాయక సిబ్బంది- దగ్గరలోనే ఉన్న బహనాగ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు.

అందులోనే పోస్ట్ మార్టమ్ కూడా నిర్వహించారు. దీనికోసం ఈ ప్రభుత్వ పాఠశాలను తాత్కాలికంగా మార్చురీగా మార్చారు అప్పట్లో. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ పాఠశాలకు తమ పిల్లలను పంపించడానికి బహనాగ గ్రామస్తులు వెనుకాడుతోన్నారు. పాఠశాలలో దెయ్యాలు తిరుగుతున్నాయనే భయాందోళనలు బహనాగ గ్రామాన్ని పట్టి పీడిస్తోన్నాయి. 65 సంవత్సరాల కిందట కట్టిన భవనం అది.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన వారు ఆత్మలుగా ఆ స్కూల్‌లో తిరుగుతున్నారనే భయం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. పాఠశాలలు రీఓపెన్ అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి వెనుకాడుతోన్నారని, ఆత్మలు ఉన్నాయనే భయం గ్రామస్తుల్లో నెలకొని ఉందని బహనాగ హైస్కూల్ ప్రిన్సిపల్ ప్రమీలా స్వైన్ చెప్పారు. ఇదంతా భయం, మూఢనమ్మకం మాత్రమేనని తాము వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోన్నామని అన్నారు.
Demolition of Bahanaga School that became a temporary morgue to store #TrainCrash victims begins. CM @Naveen_Odisha had ordered to demolish & rebuild it as a model school under 5T transformation initiative. #OdishaRailTragedy@XpressOdisha @NewIndianXpresshttps://t.co/6LX6DVL7g2 pic.twitter.com/iVARpI6MGo
— Hemant Kumar Rout (@TheHemantRout) June 9, 2023
పేరెంట్స్ కమిటీతో తాము సంప్రదింపులు జరిపామని, తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాన్ని పారద్రోలడానికి పూజలు చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సమాచారం తెలియడంతో బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ భావుసాహెబ్ షిండే.. గురువారమే బహనాగలో పర్యటించారు. తాత్కాలికంగా మార్చురీగా మార్చిన పాఠశాలను సందర్శించారు. గ్రామస్తులు, పేరెంట్స్ కమిటీతో మాట్లాడారు. దీన్ని పడగొట్టి కొత్త భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీనికి వారు అంగీకరించడంతో ఇవ్వాళ పాఠశాల కూల్చివేత పనులు మొదలయ్యాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications