'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది, ఈ ప్రశ్నకు జవాబివ్వండి'

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసి పోయిందని, కానీ తాము అడుగుతున్న రెండో ప్ర‌శ్న‌కు మాత్రం మీరే స‌మాధానం చెప్పాలని ముంబై ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఇందుకు సోష‌ల్ మీడియాను వేదిక‌ను ఎంచుకున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. దీనిపై ఎంతోమంది యూజ‌ర్లు ర‌క‌ర‌కాలుగా స‌మాధానం ఇస్తున్నారు.

bahubali 2

ఈ పోస్టులో రెండు ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటిది.. బాహుబలిని ఎందుకు చంపాడు. రెండోది ప్రజలు ట్రాఫిక్‌ నియమాలను ఎందుకు పాటించరు అనే ప్రశ్నలు వేశారు.

మొద‌టి ప్ర‌శ్న‌కు సమాధానం తెలిసిపోయిందని, ఇక‌ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. వీటికి ఎన్నో సమాధానలు వచ్చాయి.

ఒక యూజర్ మాత్రం మళ్లీ ట్రాఫిక్ పోలీసులకే ప్రశ్న వేసింది. ప్రభుత్వం సరిగ్గా ఎందుకు రోడ్లు వేయించదని ప్రశ్నించారు. దీనికి మీరు సమాధానం చెబితే రెండో దానికి తాము సమాధానం చెబుతామని అడిగారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Mumbai police has posted a message that's as socially relevant as it is tongue in cheek.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి