జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో ?, ఆరేళ్ల తరువాత బయటకు, డాక్టర్ ఎంతపని చేశాడు ?

జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత దారుణమైన ఘటనగా అందరూ ఖండించారు. గౌరీ లంకేష్ హత్య కేసులో జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ఆరేళ్ల తర్వాత బెయిల్ మంజూరైంది. బెంగళూరుకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసులో ముగ్గురు నిందితులకు జస్టిస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ శ్యామ్ వాదించడంతో ముగ్గురు నిందితులకు బెయిల్ లభించింది. దీంతో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నిందితులు జైలు నుంచి బయటకు రానున్నారు. బెయిల్ మంజూరయ్యాకు కొన్ని షరతులు విధించారు, బెయిల్ ప్రక్రియ పూర్తయ్యాక మంగళవారం సాయంత్రంలోగా నిందితులు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాది అంటున్నారు.

Bail granted to three accused in prominent journalist Gauri Lankesh murder case

ఇస్లాం మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిపై కర్ణాటకలోని ఉడిపిలోని నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఉడిపి జిల్లాలోని బ్రహ్మావరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ కీర్తన్ ఉపాధ్యాయపై కేసు నమోదు చేశారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో తన ఎక్స్ అకౌంట్‌లో మెసేజ్‌లు పెట్టారని ఆరోపించారు డాక్టర్ కీర్తక్ వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వ్యాఖ్యపై సర్వత్రా విమర్శలు, ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ డాక్టర్ మీద కేసు నమోదు చేశారు. ముస్లిం కమ్యూనిటీ అని ఉపాధ్యాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మతతత్వ భావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, తక్షణమే ఆ డాక్టర్ ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజ్మల్‌ ఇబ్రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివాదం కారణంగా ఆ పోస్ట్‌ను డాక్టర్ తొలగించారని తెలిసింది. అయితే డాక్టర్ కీర్తక్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+