షాక్: రహదారుల వెంట మద్యం దుకాణాలు బంద్: సుప్రీం సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై మద్యం దుకాణాలను ఎత్తివేయాలనే ఉత్తర్వులను సవరించాలనే పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కీలక తీర్పును వెలువరించింది.ఈ ఏడాది ఏప్రిల్ 1వ, తేది నుండి ఇది అమల్లోకి వస్తోందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేయాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.అయితే ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

జాతీయ, రాష్ట్ర రహదారులకు ఒకే రకమైన నిబంధన సరికాదని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.బుధ, గురువారాల్లో ఈ విషయమై పిటిషనర్ల తరపున వాదనలు విన్న సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కీలకమైన తీర్పును ఇచ్చింది.

Ban on highway liquor vends will come into effect from April 1: SC

మద్యం విక్రయదారులు జాతీయ, రాష్ట్ర రహదారులకు కనీసంగా 500 మీటర్ల దూరంలో ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది.

మద్యం దుకాణాలు రహదారులపైకి కన్పించకూడదని కూడ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలు మద్యం దుకాణాలకే పరిమితం కాదని, బార్స్, రెస్టారెంట్లకు, పబ్ లకు కూడ ఇది వర్తిస్తోందని కోర్టు చెప్పింది.

అయితే 20 వేల కంటే జనాభా తక్కువగా మున్సిపల్ ప్రాంతాలకు మినహయింపు ఇవ్వనున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది.అయితే 500 మీటర్ల నుండి 220 మీటర్ల వరకు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చని సుప్రీం ఆదేశించింది.అయితే ఈ ఎక్సైజ్ ఈయర్ పూర్తయ్యేవరకు రహదారుల పక్కన ఉన్న దుకాణలను కొనసాగించవవ్చని చెప్పింది.

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎక్సైజ్ ఈయర్ ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది.
అయితే మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం 500 మీటర్త దూరం వరకు మద్యం దుకాణాలను తరలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పప్టం చేసింది.అయితే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం 220 మీటర్ల దూరాన్ని మాత్రం ఫాలో కావాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఏప్రిల్ 1వ, తేది నుండి ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Friday refused to relax the March 31 ban on closure of liquor vends along national and state highways The Supreme Court said that the vends would have to move away 500 metres from the highway. The liquor shops should not be visible from the highways, the court also said.
Please Wait while comments are loading...