ఎన్ఐఏ చేతికి చర్చి స్ట్రీటు బాంబు పేలుడు కేసు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి అప్పగించడానికి రంగం సిద్దం అయ్యింది. కేసు విచారణ ఎన్ఐఏకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
2014 డిసెంబర్ 28వ తేది రాత్రి 8.20 గంటల సమయంలో చర్చి స్ట్రీట్ లోని కోకోనెట్ గ్రోవ్ హోటల్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో చెన్నయ్ కు చెందిన భవాని (37) అనే మహిళ మరణించగా ముగ్గురికి తీవ్రగాయాలైనాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో దర్యాప్తు చేశారు. బీహార్ వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్టు అయిన వారిని బాడివారెంట్ మీద బెంగళూరు తీసుకువచ్చి విచారణ చేసినా ఫలితం లేకపోయింది.
కేసు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగుతారని తెలిసింది.












Click it and Unblock the Notifications